నారా రోహిత్ కొత్త చిత్రం టైటిల్ 'శంకర'
దర్శకుడు తాతినేని సత్యప్రకాష్ మాట్లాడుతూ ''ఉత్కంఠను కలిగించే ప్రేమ కథతో దీన్ని తీర్చిదిద్దుతున్నాం. ఇందులో పైట్స్ ఆసక్తికరంగా ఉంటాయి. కథకు తగ్గ పేరు కావడంతో 'శంకర' అని నిర్ణయించాం. అటు యువతనీ, ఇటు మాస్‌నీ సమంగా అలరిస్తుంది''అన్నారు.
చిత్ర నిర్మాత మాట్లాడుతూ ''నారా రోహిత్ నటన అందరికీ నచ్చుతుంది. ఈ నెల 22 నుంచి పాటల్ని చిత్రీకరిస్తాం. వచ్చే నెల మొదటి వారంలో గీతాల్ని, చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తా ము''అన్నారు. ఆహుతిప్రసాద్, జాన్ విజయ్, రాజీవ్ కనకాల, చిన్నా, రాఖీ, సత్యకృష్ణన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కళ: సాహి సురేష్, సంగీతం: సాయికార్తీక్, ఛాయాగ్రహణం: సురేందర్‌రెడ్డి.
అలాగే... నారా రోహిత్ హీరోగా 'మద్రాసి' అనే చిత్రం కూడా రూపొందుతోంది. వల్లభనేని రోశయ్య సమర్పణలో వెంకటసూర్యతేజ ప్రొడక్షన్స్ పతాకంపై 'ప్రస్థానం' నిర్మాత రవి వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా విజయ్ లింగమనేనిని దర్శకునిగా పరిచయం అవుతున్నారు.


Click it and Unblock the Notifications












