»   »  లాజిక్ లేదంటూనే ఫస్ట్ లుక్ వదిలేసాడు (ఫొటో)

లాజిక్ లేదంటూనే ఫస్ట్ లుక్ వదిలేసాడు (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'ప్రతినిధి' చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో తన సినిమాల జోరు పెంచారు. తాజాగా ఆయన నటిస్తున్న మరో చిత్రం 'రౌడీ ఫెలో 'ఫస్ట్ లుక్ ని విడుదల చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. అంతేకాదు.. ''అరవై సెకన్లకు 72 సార్లు కొట్టుకొనే గుండెకే లాజిక్‌ లేదు. ఇక నేను చేసే పనుల గురించి అడిగితే నేనేం చెబుతాను..'' అంటున్నారు నారా రోహిత్‌.

నారా రోహిత్ హీరోగా మూవీ మిల్స్, సినిమా 5 సంస్థలు నిర్మిస్తున్న 'రౌడీ ఫెలో ' చిత్రం రెండు పాటలు మినహా పూర్తయింది. రామోజీ ఫిలిం సిటీ, రాజమండ్రి, కొల్లేరు, భీమవరం ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. ఈ పాటలను నెలాఖరు నుంచి శ్రీలంకలో చిత్రీకరించనున్నారు.

Nara Rohit Rowdy Fellow first look poster

నిర్మాత టి. ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ 'యాక్షన్, కామెడీ, రొమాన్స్ అంశాలు మిళితమైన సినిమా ఇది. దర్శకుడు కృష్ణచైతన్య విభిన్నంగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. 'స్వామి రారా', 'ఉయ్యాల జంపాలా' చిత్రాలకు పనిచేసిన సన్నీ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. 'ఆషికి-2' చిత్రంలో తన గానంతో దేశాన్ని ఉర్రూతలూగించిన గాయకుడు ఆర్జిత్ సింగ్ ఇందులోని అన్ని పాటలూ పాడటం విశేషం' అని తెలిపారు.

విశాఖా సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేశ్, పరుచూరి వెంకటేశ్వరరావు, గొల్లపూడి, పోసాని, తాళ్లూరి రామేశ్వరి, సుప్రీత్, అజయ్, ఆహుతి ప్రసాద్, ప్రవీణ్, సత్య ఇతర ముఖ్యతారాగణం. గీత రచయిత కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా5, మూవీ మిరాకిల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సన్ని సంగీతం అందిస్తున్నారు.

English summary
Here is the first look poster of Nara Rohit's latest film Rowdy Fellow Directed by Krishna Chaitanya (lyricist turned director) and produced by Prakash Reddy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu