»   »  డిఫెరెంట్: నారా రోహిత్ ‘అసుర’ టీజర్ (వీడియో)

డిఫెరెంట్: నారా రోహిత్ ‘అసుర’ టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కెరీర్ లో చేసింది తక్కువ సినిమాలైనా..ప్రతి సినిమాలో విభిన్నపాత్రలో కనిపించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు నారా రోహిత్‌. అలాటిందే ఇప్పుడు ఓ విభిన్న గెటప్‌లో నటించిన ‘అసుర' చిత్రం టీజర్ ను విడుదల చేశారు. దేవాస్ మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్, కుషాల్ సినిమా, అరన్ మీడియావర్క్స్ బ్యానర్స్ పై రూపొందుతోన్న చిత్రం ‘అసుర'. డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేసిన ఈ టీజర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. మీరూ ఈ టీజర్ పై ఓ లుక్కేయండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నారా రోహిత్ సమర్పణలో శ్యామ్ దేవభక్తుని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. రౌడీ ఫెలో తర్వాత పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించనున్నాడు.

టైటిల్లో కొత్తదనంతో పాటు టీజర్ తో సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తిని రేపారు. ఈ సినిమాలో రోహిత్ జైలర్ గా నటించారు. టీజర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా కథేంటి.. అని అందరిలో ప్రశ్న మొదలయ్యింది. ఒక రాక్షసుడి పేరును హీరోకి పెట్టడమే ఆసక్తి కలగడానికి కారణం.

Nara Rohit's Asura Teaser Talk

నారా రోహీత్ మాట్లాడుతూ... గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో, డిఫరెంట్ కథతో ‘అసుర' సినిమా ఉంటుంది. నా కేరక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. చాలా ఇంటెన్స్ ఉన్న క్యారెక్టర్. కమర్షియల్ హంగులతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది అని తెలిపారు.

కృష్ణ విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రియా బెనర్జీ హీరోయిన్. జేమ్స్ మధు, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు. నారా రోహిత్ సమర్పణలో శ్యామ్ దేవభక్తుని ఈ సినిమాను నిర్మించారు.

హీరోయిన్ విషయానికి వస్తే... అడవి శేష్ సరసన ‘కిస్' సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియా బెనర్జీ తెలుగులో మరో అవకాశం సొంతం చేసుకుంది. విజయ్ లింగమనేని దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా తెరకేక్కబోయే కొత్త సినిమాలో ప్రియా బెనర్జీని హీరోయిన్ గా చేస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రియా బెనర్జీ ట్రెడిషనల్ అమ్మాయిగా నటిస్తుంది. ఈ సినిమాలో అవకాశం రావడం పట్ల ప్రియా సంతోషం వ్యక్తం చేసింది. ‘కిస్' తర్వాత సందీప్ కిషన్ ‘జోరు'లో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా ప్రియా బెనర్జీ నటించింది. ‘జోరు' చిత్రీకరణ సమయంలో ఆమె నటన నచ్చడంతో నారా రోహిత్ సినిమా దర్శకనిర్మాతలకు రికమండ్ చేశారు.

English summary
Nara Rohith is back again with 'Good is Bad' theme for his new film 'Asura'. Nara Rohit himself presenting the film and the first look teaser of the film creating ripples.
Please Wait while comments are loading...