»   » నారా రోహిత్‌ మరో కొత్త చిత్రం మొదలైంది

నారా రోహిత్‌ మరో కొత్త చిత్రం మొదలైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : నారా రోహిత్ వరస చిత్రాలు కమిటవుతున్నారు. ఇటీవలే 'ప్రతినిధి'గా మారిన నారా రోహిత్‌ హీరోగా మరో కొత్త సినిమా ప్రారంభమైంది. బాణం, సోలో చిత్రాల విజయాలతో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ గీత రచయిత కృష్ణచైతన్య దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మూవీ మిల్స్ అండ్ సినిమా 5 సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో జరిగాయి.

ఈ సందర్భంగా చిత్ర సహ నిర్మాత సందీప్ కొరిటాల చిత్ర విశేషాలను తెలియజేస్తూ 'యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరో పాత్ర చాలా వైవిధ్యంగా వుంటుంది. కృష్ణచైతన్య ఓ అద్భుతమైన కథతో రూపొందిస్తున్న పక్కా కమర్షియల్ చిత్రమిది. రోహిత్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీవ్యయంతో నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభిస్తాం' అన్నారు.

విశాఖ సింగ్, నందినిరాయ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో నాజర్, ఆహుతి ప్రసాద్, రావు రమేష్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పరుచూరి వెంక అజయ్, సత్యంరాజేష్, ప్రభాకర్ (మర్యాద రామన్న), ప్రవీణ్, జోగినాయుడు, సత్య, టిల్లూ, నిశాంతి తదితరులు ముఖ్యపావూతలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: వెంక కో-డైక్టర్: సిహెచ్ విజయ్, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోక్షిగఫీ: అరవిందన్.పి.గాంధీ, సంగీతం: సన్నీ ఎమ్.ఆర్, సహ నిర్మాత: సందీప్ కొరిటాల, నిర్మాణం: మూవీ మిల్స్ అండ్ సినిమా5 రచన, దర్శకత్వం: కృష్ణచైతన్య.


మరో ప్రక్క నారా రోహిత్, రెజీనా జంటగా శ్రీ లీలా మూవీస్ పతాకంపై తాతినేని సత్యప్రకాష్ దర్శకత్వంలో ఆర్వీ చంద్రవౌళీ ప్రసాద్ నిర్మిస్తున్న 'శంకర' చిత్రానికి సంబంధించి ఒక పాట మినహా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిర్మాత చంద్రవౌళి మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించిన పాట త్వరలో చిత్రీకరిస్తామని, ప్రస్తుతం రీరికార్డింగ్ జరుపుతున్నామని తెలిపారు. వచ్చేనెలలో ఆడియో విడుదల చేసి నెలాఖరుకు చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. దర్శకుడు మంచి కథతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, కొత్త నిర్మాత అయిన చంద్రవౌళి చక్కగా నిర్మించారని, తన కెరీర్‌లో ఓ మంచి చిత్రంగా ఈ సినిమా నిలబడుతుందని హీరో రోహిత్ తెలిపారు.

English summary
Nara Rohit has already announced four movies 'Shankara', 'Madrasi', 'Lover' and 'Pratinidhi' and now he has launched yet another film with lyricist Krishna Chaitanya as the director. Movie Mills and Cinema 5 are producing the film jointly and the customary rituals were performed in Hyderabad. Co-Producer Sandeep Koritala introduced the movie as an action entertainer. 'The director Krishna Chaitanya has come up with a brilliant story and this will be the biggest film in Rohit's career as per the budget. We will go on sets from the 25th of this month'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu