»   »  నారా రోహిత్ నెక్ట్స్ చిత్రం లాంచ్ అయ్యింది

నారా రోహిత్ నెక్ట్స్ చిత్రం లాంచ్ అయ్యింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా అసుర అంటూ పలకరించిన నారా రోహిత్ ...తన తదుపరి చిత్రాన్ని మొదలెట్టేసారు. నారా రోహిత్‌ హీరోగా ‘అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీ విష్ణు మరో హీరో. ‘అయ్యారే' ఫేం సాగర్‌.కె.చంద్ర దర్శకుడు. వశిష్ఠ మూవీస్‌ పతాకంపై హరివర్మ, సన్నీరాజ్‌ నిర్మిస్తున్నారు.

పూజా కార్యక్రమాల అనంతరం అనిల్‌ రావిపూడి క్లాప్‌నిచ్చారు. నారా రోహిత్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. అర్జున్‌ వర్మ గౌరవ దర్శకత్వం వహించారు. నారా రోహిత్‌ ఇందులో ముస్లిం యువకుడిగా కనిపిస్తారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘1992-96 మధ్య జరిగే పీరియాడిక్‌ కథ ఇది. పాత బస్తీ నేపథ్యంలో సాగుతుంది. ఇద్దరు కథానాయికల్ని ఎంపిక చేయాల్సి ఉంది. జూలై మొదటివారంలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం'' అని అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ ''1992-1996 సంవత్సరాల మధ్య ఇద్దరు యువకుల జీవితాల్లో చోటు చేసుకొన్న కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. 'ప్రేమ ఇష్క్‌ కాదల్‌' చిత్రంలో రాయల్‌ రాజుగా నటించి మెప్పించిన శ్రీవిష్ణు ఇందులో మరో హీరో గా నటిస్తున్నారు''అన్నారు.

పోసాని కృష్ణమురళీ, రాజీవ్‌ కనకాల, రఘు కారుమంచి, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, కెమెరా: నవీన్‌ యాదవ్‌, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి.

Nara Rohit's next launched

ఇక అసుర విషయానికి వస్తే....

నారా రోహిత్‍‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అసుర'. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాపై మొదట్నుంచే మంచి అంచనాలు ఉండడంతో ఓపినింగ్స్ బాగున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ కూడా రావడంతో వీకెండ్స్ కూడా ఫరవాలేదనిపించుకుంది.

కృష్ణ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు శ్యామ్ ధేవభక్తుని నిర్మాత కాగా, నారా రోహిత్ సహ నిర్మాతగా వ్యవహరించడం విశేషం., హీరో నారా రోహిత్, విలన్ రవివర్మల యాక్టింగ్ ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌గా నిలిచాయి.

English summary
Nara Rohit is readying for his next under the direction of Sagar K Chandra of Ayyare fame. The film titled Appatlo Okadundevaadu was launched in style. Hari and Sunny Raju will be producing the film on Vasishta Movies Banner.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu