»   » నారా వారి పొలిటికల్ ప్లాన్? ...25 వస్తున్న ‘ప్రతినిధి’

నారా వారి పొలిటికల్ ప్లాన్? ...25 వస్తున్న ‘ప్రతినిధి’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నారా రోహిత్ కథానాయకుడిగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ ప్రతినిధి. సుధా మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువ ప్రతిభాశాలి ప్రశాంత్ మండవ దర్శకుడు, గుమ్మడి రవీంద్రబాబు సమర్పణలో జె.సాంబశివరావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

వాస్తవానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా....కావాలనే ఆలస్యంగా విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ అంశాలతో కూడిన ఈచిత్రాన్ని ఎన్నికల ముందు విడుదల చేయడం....సినిమాలోని అంశాలు ప్రేక్షకులపై ప్రభావంచూపి వారు తెలుగుదేశం పార్టి కి మద్దతు ఇచ్చే దిశగా ఓటర్లలో మార్పు తెస్తుందనే అంటున్నారు.

Nara Rohit's Prathinidhi release on 25 April

నారా రోహిత్ సరసన శుబ్ర అయ్యప్ప కథానాయకుడిగా నటించబోతున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించారు. తెలుగు దేశం పార్ట అధినేత చంద్రబాబు నాయుడు ఆవిష్కరించిన ఈ చిత్రం 25న ఆంధ్ర-తెలంగాణ, ఓ వర్సీ‌‌స్ లోనూ విడుదలవుతున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమని తెలిపారు.

నిర్మాత మాట్లాడుతూ 'ఇటీవల ప్రజాప్రతినిధి నారాచంద్రబాబునాయుడు చేతుల మీదుగా విడుదలైన మా "ప్రతినిధి" పాటలకు మంచి స్పందన లభిస్తోంది. దర్శకుడు ప్రశాంత్ కొత్తవాడైనా ఏ అగ్ర దర్శకుడికీ తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సాయికార్తీక్ అందించిన బాణీలతో పాటు ఆర్.ఆర్ కూడా ఈ చిత్రానికి ఆయువుపట్టుగా నిలవనుంది.

నిర్మాణానంతర కార్యక్రమాలు చురుగ్గా జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రస్తుత రాజకీయాల పరిణామాలు సగటు మనిషి జీవితాన్ని ఎలా మారుస్తున్నాయి? అనేది చిత్ర ప్రధానాంశం. "ప్రతినిధి" చిత్రాన్ని ప్రతి ఒక్కరు తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను'అన్నారు.

English summary
Nara Rohit, Shubra Aiyappa starrer Prathinidhi release on 25 April.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu