»   » కిడ్నాప్ డ్రామా ( ‘ప్రతినిధి’ ప్రివ్యూ)

కిడ్నాప్ డ్రామా ( ‘ప్రతినిధి’ ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nara Rohit's Pratinidhi Movie Preview
హైదరాబాద్ : వర్తమాన రాజకీయాల్ని ప్రశ్నించే ప్రజా 'ప్రతినిధి'గా నారా రోహిత్ ఈ రోజు ప్రేక్షకులముందుకు వస్తున్నారు. సమకాలీన రాజకీయాంశాల్ని చర్చిస్తూ సందేశాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతోందని, ప్రజా శ్రేయస్సును కాంక్షించే సిసలైన ప్రజా ప్రతినిధి ఎలా వుండాలో సినిమాలో చూపిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఈరోజుల్లో రూపాయికే విలువ లేదు. ఇక పైసల్ని పట్టించుకొనేదెవరు? కానీ అతను అలా కాదు. ప్రతి పైసాకీ సమాధానం చెప్పాల్సిందే. ఎనభై నాలుగు పైసల కోసం ఏకంగా.. ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేశాడు. ప్రభుత్వ యంత్రాంగాన్ని తన కాళ్ల దగ్గరకు రప్పించాడు. ఇంతకీ అతనెవరు? ఆ తరవాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అనేదే చిత్రం కథ. రాజకీయ వ్యవస్థను ఎదుర్కునే ఒక సాధారణ వ్యక్తి కోణంలో రోహిత్ పాత్రను రూపొందించారు.

దర్శకుడు మాట్లాడుతూ ''సమకాలీన సమస్యలపై ఓ సామాన్యుడు సాగించిన సమరం ఇది. ప్రతినిధిగా నారా రోహిత్‌ నటన, ఆయన పలికే సంభాషణలు అందరికీ నచ్చుతాయి. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది. ప్రచార చిత్రం కూడా ఆకట్టుకొంటోంది''అన్నారు. ''ప్రస్తుత రాజకీయాలు సగటు మనిషి జీవితాన్ని ఎలా మారుస్తున్నాయో ఈ చిత్రంద్వారా చూపిస్తున్నాం''అని నిర్మాత చెప్పారు.

నారా రోహిత్ మాట్లాడుతూ.. '18 సంవత్సరాల వయసులో ప్రేమించి పెళ్లిచేసుకుంటే జీవితం పాడైపోతుందని అందరూ అంటారు. అదే 18 సంవత్సరాల వయసులో ఓటేస్తే ప్రభుత్వం పాడైపోతుందని ఎవరూ అడగరే...వస్తున్నా...అడగడానికే వస్తున్నా..' అన్నారు.

బ్యానర్ :సుధామూవీస్‌ పతాకం
నటీనటులు :నారా రోహిత్, శుబ్ర అయ్యప్ప, పోసాని కృష్ణమురళి, కోట, విష్ణువర్ధన్‌ తదితరులు
కథ,మాటలు:ఆనంద్ రవి
కెమెరా: చిట్టిబాబు,
సంగీతం : సాయికార్తీక్‌
ఎడిటింగ్‌: నందమూరి హరి.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రశాంత్‌ మండవ
సమర్పణ: గుమ్మడి రవీంద్రబాబు
నిర్మాత: జె.సాంబశివరావు

English summary

 Pratinidhi is the latest movie of Nara Rohit whose acting talent received rave reviews even from critics. The movie is about a youth who questions the selfish politics. This is directed by Prashanth and Subhra Ayyappa played the female lead role. Pratinidhi is releasing today adding to the heat of elections in the state. The movie release was delayed by few days and it now releasing at a perfect time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu