»   » తప్పు అనిపిస్తే వేలెత్తి చూపుతా: నారా రోహిత్

తప్పు అనిపిస్తే వేలెత్తి చూపుతా: నారా రోహిత్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: నారా రోహిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'శంకర'. రెజీనా హీరోయిన్ . తాతినేని సత్యప్రకాష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్‌.చంద్రమౌళి ప్రసాద్‌ నిర్మాత. కె.ఎస్‌.రామారావు సమర్పకులు. షూటింగ్ తుదిదశకు చేరుకొంది. ఈ సందర్బంగా మీడియాతో చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడారు.

నారారోహిత్ మాట్లాడుతూ... తప్పు అనిపిస్తే వేలెత్తి చూపుతాడు. అది ఎదుటివారికి మింగుడు పడలేదంటే మాత్రం పోరాటానికి దిగుతాడు. ఎప్పుడూ మనం గురించి మనం ఆలోచించుకోవడమే కాదు... సమాజం గురించీ కాస్త దృష్టిపెట్టాలి అంటాడు. ఆ యువకుడి జీవన గమనమే మా చిత్ర కథ అన్నారు నారా రోహిత్‌.

దర్శకుడు మాట్లాడుతూ ''అక్రమార్కుల ఆటకట్టించేందుకు ముందుకొచ్చిన ఓ యువకుడి కథ ఇది. అతని పోరాటం వెనక భావోద్వేగాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటాయి'' అన్నారు. త్వరలో పాటలు విడుదల చేస్తామన్నారు నిర్మాత. ఈ చిత్రంలో ఆహుతి ప్రసాద్‌, ఎమ్మెస్‌ నారాయణ, రాజీవ్‌ కనకాల, ప్రగతి, సత్యకృష్ణన్‌ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: సాయికార్తీక్‌, ఛాయాగ్రహణం: సురేందర్‌రెడ్డి.

English summary
Nara Rohit, Regina Cassandra's Sankara directed by Tatineni Satyaprakash is in the final stages of shooting. R.Chandramouli is producing the film presented by KS.Ramarao. Plans are on to release the audio tuned by Sai Karthik soon. Ahuthi Prasad, MS.Narayana, Rajiv Kanakala, Pragathi,Satya Krishnan are starring in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu