»   » రోహిత్ సినిమాలో అమెరికా భామ చిందులు

రోహిత్ సినిమాలో అమెరికా భామ చిందులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నారా రోహిత్ హీరోగా నటించిన శంకర సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో నారా రోహిత్ సరసన గ్లామరస్ తార రెజీనా హీరోయిన్‌గా నటించింది. లీలా మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు సమర్పణలో వాసిరెడ్డి చంద్రమౌళి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమిలీ కబడ్డీ జట్టు ఫేం తాతినేని సత్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇటీవల అమెరికా భామ హాజెల్ క్రౌనీపై చిత్రీకరించిన ఐటెం సాంగ్‌తో సినిమా షూటింగ్ పూర్తయింది. యువ సంగీత సంచలనం సాయి కార్తీక్ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రం ఆడియోను అక్టోబర్‌ నెలలో విడుదల చేసేందుకు నిర్మాత వాసిరెడ్డి చంద్రమౌళి ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు.

Nara Rohit and Rezina

నారా రోహిత్ పెర్‌ఫార్మెన్స్, రెజీనా అందాలు, దర్శకుడు తాతినేని సత్య టేకింగ్ మెయిల్ హైలెట్స్‌గా శంకర చిత్రం అద్భుతంగా తెరకెక్కుతోందని వాసిరెడ్డి చంద్రమౌళి ప్రసాద్ అన్నారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ ద్వారా త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు.

అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని, తమ యూనిట్ సభ్యులందరూ సినిమా విజయంపై చాలా నమ్మకంగా ఉన్నారని ఆయన చెప్పారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

నారా రోహిత్, రెజీనా జంటగా నటించిని ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తిక్, సమర్పణ: కెఎస్ రామారావు, నిర్మాత: వాసిరెడ్డి చంద్రమౌళి ప్రసాద్, దర్శకత్వం: తాతినేని సత్య

English summary
Raising star Nara Rohit and Rezina starred Shankara film shooting has been completed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu