నారా రోహిత్ 'తుంటరి' ఫస్ట్‌లుక్ (ఫొటో)
హైదరాబాద్: శ్రీ కీర్తి ఫిలిమ్స్ పతాకంపై నారా రోహిత్ హీరోగా రూపుదిద్దుకున్న కొత్త చిత్రం 'తుంటరి' ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ విషయాన్ని నారా రోహిత్ తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతా ద్వారా తెలిపారు. కుమార్ నాగేంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అశోక్ బాబా, నాగార్జునలు సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు.
First look of TUNTARI ( official remake of MAAN KARATE )
Posted by Nara Rohith on 21 October 2015
ఈ చిత్రం తమిళంలో విజయవంతమైన మాన్ కరాటే చిత్రానికి అఫీషియల్ రీమేక్. న్యూజ్ లాండ్ కు చెందిన మోడల్ లతా హేడ్గే ఈ చిత్రంలో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ చిత్రం ఓ స్పోర్ట్స్ కామెడీ. గత సంవత్సరం తమిళంలో విజయవంతమైన చిత్రాల్లో ఇది ఒకటి.
ఈ చిత్రానికి కథను ఎఆర్ మురగదాస్ అందించారు. ఈ చిత్ర నిర్మాతలు గతంలో అశోక్, నాగార్జున గతంలో జోరు చిత్రాన్ని నిర్మించారు. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అయితే అదే దర్శకుడు కుమార్ నాగేంద్రతో ఈ చిత్రం నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











