»   » నారా రోహిత్ కమిటైన కొత్తం చిత్రం డిటేల్స్

నారా రోహిత్ కమిటైన కొత్తం చిత్రం డిటేల్స్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: బాణం చిత్రంతో పరిచయమైన నారా రోహిత్ వరసగా చిత్రాలు కమిటవుతున్నారు. తాజాగా ఆయన భీమిలీ కబడ్డి జట్టు దర్శకుడు తాతినేని సత్య దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం కమిటయ్యారు. వచ్చే జనవరి మొదటి వారంలో చత్రం ప్రారంభం అవుతుంది. ఈ చిత్రాన్ని ఆర్.వి.సి.హెచ్ ప్రసాద్ నిర్మిస్తూండగా,కె.ఎస్ రామారావు సమర్పించనున్నారు. ఈ చిత్రంలో తాతినేని సత్య చెప్పిన పాత్ర,క్యారెక్టరైజేషన్ బాగా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇక తాతినేని సత్య ఇంతకుముందు సుధీర్ బాబుతో ఎస్ ఎమ్ చిత్రం చేసారు. ఇప్పటివరకూ ఆయన చేసినవి రెండూ రీమేక్ లే కావటం విశేషం.

  ఇక ప్రస్తుతం నారా రోహిత్.. శ్రీనివాస రాగ దర్శకత్వంలో 'ఒక్కడినే' చిత్రం చేస్తున్నారు. నిత్యా మీనన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత సి.వి.రెడ్డి గులాబీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. సూర్య అనే యువకుడికీ ఓ ప్రవాసాంధ్ర యువతికీ మధ్య సాగే ప్రేమ..వాటి మూలంగా వచ్చే సమస్యలుగా జరుగుతుంది. నేడు మన కుటుంబాల్లో జరిగేటువంటి అనుబంధాల్ని టచ్‌ చేస్తూ నిర్మిస్తున్న కుటుంబ కథా చిత్రమిది.

  అలాగే... నారా రోహిత్ హీరోగా 'మద్రాసి' అనే చిత్రం కూడా రూపొందుతోంది. వల్లభనేని రోశయ్య సమర్పణలో వెంకటసూర్యతేజ ప్రొడక్షన్స్ పతాకంపై 'ప్రస్థానం' నిర్మాత రవి వల్లభనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా విజయ్ లింగమనేనిని దర్శకునిగా పరిచయం అవుతున్నారు.

  వీటితో పాటు రవితేజ సారొచ్చారు చిత్రంలో నారా రోహిత్ స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఆ పాత్ర కథను కీలకమైన మలుపు తిప్పనుందని తెలుస్తోంది. గతంలో పరుసరామ్,నారా రోహిత్ కాంబినేషన్ లో సోలో అనే చిత్రం రూపొందింది. ఈ అనుబంధంతో ఈ ప్రత్యేక పాత్రకు నారా రోహిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇలా వరస ప్రాజెక్టులతో నారా రోహిత్ బిజీగా ఉన్నారు.

  English summary
  Nara Rohit will soon be teaming up with director Tatineni Satya of Bheemili Kabaddi Jattu and SMS fame for a film that's being touted as an action-thriller. Nara Rohit was apparently very impressed with the script and characterization and has given the green signal to the director. The film is expected to go on floors in mid January 2013. RVCH Prasad (Kinnu) is producing the film, while KS Rama Rao is presenting the film.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more