»   » నిర్మాతగా మారిన హీరో నారా రోహిత్

నిర్మాతగా మారిన హీరో నారా రోహిత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాణం, సోలో చిత్రాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రోహిత్....మరో వైపు సినిమా నిర్మాణ రంగంలో కూడా అడుగు పెడుతున్నారు. నల దమయంతి అనే చిత్రాన్ని నిర్మిస్తూ ప్రొడ్యూసర్ అవతారం ఎత్తబోతున్నారు.

ఆర్ కె మీడియా సంస్థ అధినేత రవికుమార్ పనస, నారా రోహిత్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముగ్గురు ప్రధాన కథానాయకులు ఉండే ఈ చిత్రానికి నారా రోహిత్ సమర్పకులుగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. 'రవి పనస ఫిలిం కార్పోరేషన్' అనే బ్యానర్లో ఈచిత్రాన్ని నిర్మించనున్నారు.

Nara Rohit turn as producer

ఈ చిత్రం ద్వారా కోవెరా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కోవెరా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. ఈ చిత్రంలో 'ప్రేమ ఇష్క్ కాదల్', సెకండ్ హ్యాండ్ చిత్రాల్లో నటించిన 'రాయల్ రాజు' విష్ణు ఈ చిత్రంలో ముఖ్య మైన పాత్రలో నటించనున్నాడు. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

నారా రోహిత్ సినిమాల విషయానికొస్తే....ఆయన నటించిన 'ప్రతినిధి' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు ఆయన శంకర, మద్రాసి, లవర్, రౌడీ ఫెల్లో అనే చిత్రాల్లో నటిస్తున్నారు. ఈచిత్రాన్నీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ చిత్రాల్ని ఈ సంవత్సరం విడుదలయ్యే అవకాశం ఉంది.

English summary
The latest news is that actor Nara Rohit going to present an upcoming film titled ‘Nala Damayanti’. Ravi Panasa is going to produce this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu