జగపతిబాబు, నారా రోహిత్ ‘ఆటగాళ్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్
నారా రోహిత్, జగపతిబాబు హీరోలుగా తెరకెక్కుతోన్న సినిమా ఆటగాళ్లు. ఈ చిత్రం ఆగస్ట్ 24న ఈ చిత్రం విడుదల కానుంది. పరుచూరి మురళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దర్షన బానిక్ ఈ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అవుతుంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్.. ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. నారా రోహిత్, జగపతిబాబుపై వచ్చే ప్రతీ సన్నివేశం కూడా సినిమాలో హైలైట్ గా నిలవనుంది. సాయికార్తిక్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ ఆటగాళ్లు చిత్రానికి మరో మేజర్ హైలైట్.

పెద్ద హీరోలు ముందుకు వస్తే భవిష్యత్తులో మరిన్ని మంచి కథలు వస్తాయి. చాలా వైవిధ్యమైన సినిమా ఇది. బ్రహ్మానందంగారి కామెడీ హైలైట్ గా నిలుస్తుందని నిర్మాతలు తెలిపారు. అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. దర్శకుడు మురళి "ఆటగాళ్లు" చిత్రాన్ని అద్భుతంగా మలిచిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది అని చెప్పారు.
ఈ చిత్రానికి మాటలు: గోపి, కెమెరా: విజయ్.సి.కుమార్, మ్యూజిక్: సాయికార్తీక్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: ఆర్.కె.రెడ్డి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.సీతారామరాజు, నిర్మాతలు: వాసిరెడ్డి రవీంద్ర-వాసిరెడ్డి శివాజీ-మక్కెన రాము-వడ్లపూడి జితేంద్ర, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: పరుచూరి మురళి.


Click it and Unblock the Notifications











