»   » అవసరాల డైరక్షన్...."జ్యో అచ్యుతానంద" టీజర్ (వీడియో)

అవసరాల డైరక్షన్...."జ్యో అచ్యుతానంద" టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో దర్శకుడిగా మారిన అవసరాల శ్రీనివాస్‌ ప్రస్తుతం మరో సినిమాను డైరెక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. "జ్యో అచ్యుతానంద" అనే టైటిల్ ను వస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్, నాగ శౌర్య, రెజినా కీలక పాత్రలలో నటిస్తున్నారు.. కాగా ఈ చిత్రం టీజర్ ను విడుదల చేశారు.. ఈ టీజర్..నాగశౌర్య, నారా రోహిత్ మధ్య పోటీగా సాగింది. మీరూ ఓ లుక్కేయండి.

గతంలో 'ఊహలు గుహగుసలాడే' వంటి రొమాంటిక్ సినిమాని ప్రేక్షకులకందించిన అవసరాల శ్రీనివాస్ ఈ సినిమాని ఇద్దరు అన్నదమ్ముల కథకు ప్రేమకథను జోడించి తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నారా రోహిత్ హీరోగా, నాగశౌర్య అతని తమ్ముడిగా నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కళ్యాణ్ కోడూరి సంగీతాన్ని అందించనున్నారు.

Nara Rohith's Jyo Achyutananda Teaser

అలాగే ఈ సినిమాలో రెజీనా డెంటిస్ట్ పాత్రను పోషిస్తోందిట. చాలా మంది అమ్మాయిలు నిజ జీవితంలో ఎదుర్కొనే పాత్రను ఇందులో పోషిస్తున్నానని రెజీనా చెప్తోంది. పద్దతైన కుటుంబం నుంచి వచ్చిన ఓ అమ్మాయికి ఇద్దరు అన్నదమ్ములతో రిలేషన్ ఎలా ఉండబోతోందనే కాన్సెప్ట్ అంటున్నారు.

జ్యోతి, అచ్యుతరామారావు, ఆనంద వర్ధనరావు అనే మూడు పాత్ర ల చుట్టూ ఈ కథ తిరుగు తుందట. వారి పేర్లు వచ్చే విధంగా సినిమా టైటిల్‌ ఎంపిక చేసుకున్నాడు.

Nara Rohith's Jyo Achyutananda Teaser

చక్కటి ప్రేమ కథను స్క్రీన్‌పై అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడిగా మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా తరువాత కొంత గ్యాప్‌ తీసుకున్న అవసరాల శ్రీనివాస్‌ తన రెండో సినిమా కోసం 'జ్యో అచ్యుతానంద' అనే టైటిల్‌ను ఖరారు చేయటంతోనే సగం సక్సెస్ సాధించారు.

English summary
Srinivas Avasarala, who made his directorial debut with the movie 'Oohalu Gusagusalade', directing Nara Rohith in his second movie. As reported earlier, the film has been titled as 'Jyo Achyutananda'. Here is the teaser.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu