»   »  నారా రోహిత్ ‘శంకర’ ఆడియో రిలీజ్ డేట్

నారా రోహిత్ ‘శంకర’ ఆడియో రిలీజ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రఖ్యాత నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్.రామారావు సమర్పణలో శ్రీ లీల మూవీస్ పతాకంపై ఆర్.వి.చంద్రమౌళి (కిన్ను) నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ "శంకర". నారా రోహిత్, రెజీనా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి "భీమిలీ కబడ్డీ జట్టు" ఫేం తాతినేని సత్య దర్శకుడు.

సాయి కార్తిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకను ఈ నెల 14న హైదరాబాద్, తాజ్ డెక్కన్‌లో నిర్వహించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేసుకొంటోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఆర్.వి.చంద్రమౌళి (కిన్ను) మాట్లాడుతూ.. "ఇటీవల "ప్రతినిధి'' చిత్రంతో మంచి విజయాన్నందుకోనున్న మా కథానాయకుడు నారా రోహిత్ విజయపరంపరను కొనసాగించే విధంగా "శంకర" చిత్రం ఉంటుందని తెలిపారు.

 Nara Rohith's 'Shankara' audio release on 14th

సాయి కార్తిక్ అద్భుతమైన బాణీలు అందించారు. తాతినేని సత్య దర్శకత్వ ప్రతిభ, రెజీనా గ్లామర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. ఈ నెల 14న ఈ చిత్రం ఆడియోను తాజ్ డెక్కన్‌లో అతిరధమహారధుల సమక్షంలో అత్యంత ఘనంగా విడుదల చేస్తున్నామని నిర్మాత చెప్పుకొచ్చారు.

దర్శకుడు తాతినేని సత్యప్రకాష్‌ మాట్లాడుతూ ''ఉత్కంఠను కలిగించే ప్రేమ కథతో దీన్ని తీర్చిదిద్దాం. ఇందులో పైట్స్ ఆసక్తికరంగా ఉంటాయి. కథకు తగ్గ పేరు కావడంతో 'శంకర' అని నిర్ణయించాం. అటు యువతనీ, ఇటు మాస్‌నీ సమంగా అలరిస్తుంది''అన్నారు. ఆహుతిప్రసాద్‌, జాన్‌ విజయ్‌, రాజీవ్‌ కనకాల, చిన్నా, రాఖీ, సత్యకృష్ణన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కళ: సాహి సురేష్‌, సంగీతం: సాయికార్తీక్‌, ఛాయాగ్రహణం: సురేందర్‌రెడ్డి.

English summary

 Nara Rohith will be seen soon in a film titled 'Shankara'. Regina Cassandra is the heroine. Tatineni Satya of "Bheemili Kabaddi Jattu" fame is the director. R.V.Chandramouli Prasad (Kinnu) is producing the movie under Sri Leela movies banner and K.S.Ramarao is presenting it. The audio composed by Sai Karthik will be released on May 14th at Taj Deccan in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu