»   » ఆగలేక నారా రోహిత్ కూడా అందుకున్నాడు (వీడియో)

ఆగలేక నారా రోహిత్ కూడా అందుకున్నాడు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరస పెట్టి హీరోలంతా గొంతు విప్పి పాటలు అందుకుంటున్నారు. అత్తారింటికి దారేది చిత్రంలో కాటమరాయుడా అనే పాట పాడి పవన్ కళ్యాణ్ ఈ ట్రెండ్ కు అంకురార్పణ చేసాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ పాడార. మొన్నటికి మొన్న బన్నీ తన సరైనోడు చిత్రం కోసం పాడేసారు. ఇప్పుడు అదే దారిలో నారా రోహిత్ వచ్చి చేరారు.

 Nara Rohith takes up singing now

నారా రోహిత్ తాజా చిత్రం సావిత్రి కోసం ఆయన పాట పాడారు. ఈ సినిమాలో నారా రోహిత్ లవర్ బోయ్ గా కనిపిస్తారు. ఆ పాటకు సంభదించిన మేకింగ్ వీడియోని విడుదల చేసారు. మీరు ఇక్కడ ఆ సాంగ్ చూడవచ్చు.

రోహిత్ - నందిత జంటగా నటిస్తోన్న ఈ సినిమాకి, శ్రావణ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక సందర్భంలో వచ్చే పాటను రోహిత్ పాడితే బాగుంటుందని శ్రావణ్ పట్టుబట్టాడట. దాంతో రోహిత్ ఒప్పుకోవాల్సి వచ్చిందట. అలా మొదటిసారిగా ఈ సినిమాలో ఒక పాట పాడాడు. ఆ పాట చాలాబాగా వచ్చిందని శ్రావణ్ అంటున్నారు. తన పాటను తానే పాడుకున్న హీరోల జాబితాలో తాజాగా నారా రోహిత్ కూడా చేరిపోయాడన్న మాట.

దర్శకుడు పవన్‌ సాదినేని మాట్లాడుతూ.. 'ప్రేమ ఇష్క్‌ కాదల్‌' చిత్రంతో మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు నారా రోహిత్‌తో 'సావిత్రి' చిత్రాన్ని ఒక పూర్తి కమర్షియల్‌ ఫామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిస్తున్నాం. రోహిత్‌ పెర్ఫార్మన్స్‌లో, బాడీ లాంగ్వేజ్‌లో ఎంతో కొత్తదనం ఉంటుంది.

English summary
In the upcoming film "Savitri", Rohith will be seen as a lover boy and for this film he's also singing a song under composer Shravan's scoring.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu