»   »  హీరోయిన్ పాత్రలో నారారోహిత్... ఈ ప్రయోగం ఫలిస్తుందా? అసలే ఎప్పటిదో సినిమా

హీరోయిన్ పాత్రలో నారారోహిత్... ఈ ప్రయోగం ఫలిస్తుందా? అసలే ఎప్పటిదో సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

నారా రోహిత్ హీరోగా న‌టించిన 'శంక‌ర' సెప్టెంబ‌ర్ 16వ తేదీన విడుద‌లకానుంది. నిజానికి ఎప్పుడో రావాల్సిన సిన్మా ఇది పాపం చాలా రోజులు విడుదల కాకుండానే ఆగిపోయిన సినిమ ఇది. ఎట్టకేలకు అన్ని అవరోదాలనూ దాటుకొని ఇప్పుడు రావటానికి సిద్దమైంది. ఇదిగో అదిగో అంటూనే ఏళ్లకు ఏళ్లు గడిచిపోయాయి. ఐతే ఎట్టకేలకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. ప్రయత్నాల్లో భాగంగా 'శంకర'కు సంబంధించిన కొన్ని స్టిల్స్ రిలీజ్ చేశారు. ఆ స్టిల్స్ లో ఉన్న నారా రోహిత్‌ను చూస్తేనే అర్థమైపోతుంది.. అది రోహిత్ కొన్నేళ్ల కిందటి అవతారం అని. రెజీనా కూడా ఎంత తేడాగా ఉందో అందులో స్పష్టంగా కనిపిస్తోంది.

'మౌనగురు' టైటిల్ తో 2011లో విడుదలైన ఓ తమిళ చిత్రం అక్కడ స్లో హిట్ అయ్యింది. దాంతో వెంటనే మనవాళ్లు రీమేక్ రైట్స్ తీసుకుని తెలుగులో నారా రోహిత్ తో షూటింగ్ మొదలెట్టారు. నారా రోహిత్ కూడా ఈ సినిమాపై నమ్మకాలు పెట్టుకున్నాడు. అయితే రకరకాల కారణాలతో సినిమా షూటింగ్ పూర్తైనా ఏవో కారణాల వల్ల ముందుకు వెళ్లలేదు.

 Nara Rohits Shankara is Ready to Release

నారా రోహిత్ వరుసగా సినిమాలను అంగీకరిస్తూ .. అదే స్పీడుతో వాటిని పూర్తిచేస్తూ .. ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల వచ్చిన సినిమాలు ఆయన ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో శంకర ఎంత వరకూ హెల్ప్ ఔతాడూ అనేది చూడాల్సిందే. అందుకే రెజీనా గ్లామర్ ని ఫుల్ల్ గా వాడేసుకోవాలని ఫిక్సయ్యారట. ప్రచారం లో ఎక్కువ రెజీనా ఫొటోలనే వాడనున్నారట.

ఆగిపోయిన సినిమాను విడుదలకు సిద్ధం చేయాలంటే ప్రేక్షకుల్ని ఆకర్షించేలా ఏదో ఒక ప్రయత్నం చేయాలి. అందులో భాగంగానే సెక్సీ రెజీనాను రంగంలోకి దించారు. ఆ పోస్టర్లన్నింటిలో రెజీనా కుర్రాళ్లను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. 'శంకర' తమిళ హిట్ మూవీ 'మౌనగురు'కు రీమేక్. ఈ చిత్రాన్నే టాప్ డైరెక్టర్ మురుగదాస్ హిందీలో 'అకీరా' పేరుతో రీమేక్ చేశాడు. కాకపోతే సోనాక్షి సిన్హాతో స్టంట్లు చేయించాడు. కథని హీరోయిన్ ఓరియెంటెడ్ గా మార్చాడు. ఇక్కడ అదే పాత్రను నారా రోహిత్ చేసాడు.

English summary
Nara Rohit and Regina Cassandra starrer long delayed action and romantic entertainer drama ‘Shankara’ , which was supposed to hit the theaters couple of years ago, is gearing up for release now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu