»   »  ఇకపై ఇలాంటి సినిమాలు చెయ్యను

ఇకపై ఇలాంటి సినిమాలు చెయ్యను

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నా ప్రతి సినిమాలో ఏదో ఒక కంటెంట్‌ను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి చిత్రాలు చేయాలంటే చాలా ధైర్యం కావాలి. ఇకపై మాత్రం ఇలాంటి సినిమాలు చేయను. కమర్షియల్‌ సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను అని తేల్చి చెప్పారు దర్శకుడు నరసింహ నంది.

'1940లో ఓ గ్రామం', 'హైస్కూల్‌', 'కమలతో నా ప్రయాణం' వంటి చిత్రాలను రూపొందించిన ఆయన తాజాగా 'లజ్జ' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలైన నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

నరసింహ నంది మాట్లాడుతూ...'ఇతర ఇండిస్టీలతో పోల్చితే డిఫరెంట్‌ జోనర్‌ చిత్రాలకు మన దగ్గర ఆదరణ తక్కువ. దీనికితోడు థియేటర్ల సమస్య వల్ల కూడా సినిమా అందరికి రీచ్‌ కాలేదు. మలయాళం, తమిళనాట ఇటువంటి వాటికి బాగా ఆదరణ ఉంటుంది.

హిందీలో అనురాగ్‌ కశ్యప్‌లాంటి దర్శకులు ఇలాంటి సినిమాలు చేస్తారు. వారి మార్కెట్‌ ఎక్కువగా ఉండడంతో అక్కడ బాగా ఆడతాయి. మన సినిమాలన్ని ఒక చట్రంలో ఉంటాయి. అలాంటి రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలు నేనెందుకు తీయాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి చిత్రాలను తీస్తాను.' అన్నారు.

Narasimha Nandi about his lajja

'నా సినిమాలు ఒక వర్గానికి చెందినవి. ఉన్నత స్థాయిలో ఆలోచించే వారికి, ఇంగ్లీష్‌ సినిమాలు చూసేవారికి బాగా కనెక్ట్‌ అవుతాయి. అలాగే ఈ చిత్రం కూడా కొన్ని వర్గాల ప్రేక్షకులకే కనెక్ట్‌ అయ్యింది. అయినప్పటికీ సినిమాకు స్పందన బాగుంది. కమర్షియల్‌ చిత్రాలు చూసే మన ఆడియోన్స్‌కి ఇలాంటి కాన్సెప్ట్‌ బేస్డ్‌ డిఫరెంట్‌ చిత్రాలు ఎక్కవు. దీంతో ఆదరణ తక్కువగా ఉంటుంది

అలాగే ఈ చిత్రం చేయడానికి ప్రధాన కారణం చలం పుస్తకాల ప్రభావమే. ఆయన రాసిన 'మైదానం' పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. మగజాతిపై విరక్తి చెందిన అమ్మాయి కథ ఇది. స్త్రీపై పురుషాధిపత్యం ఎలా ఉంటుందో ఇందులో చూపించే ప్రయత్నం చేశాను. సినిమా చేయడానికి చాలా కష్టపడ్డాను

నీళ్లలో లో అమ్మాయి, అబ్బాయి మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాన్ని చలం అద్భుతంగా రాశారు. ఒక్క సీన్‌ని చేయడానికి నాకు ఒక్క రోజు మొత్తం పట్టింది. నాకు తెలిసి ఏ దర్శకుడు ఈ సన్నివేశాన్ని చలం రాసినట్టుగా తీయలేరనిపించింది. నా వంతు ప్రయత్నంగా చేసినప్పటికీ, చివరికి దాన్ని సెన్సార్‌లో తీసేశారు.

సెన్సార్‌ పరిథిలో ఈ ఒక్క సీన్‌ తప్ప అద్భుతమైన సినిమా తీశావని సెన్సార్‌ అధికారి చెప్పడం నాకొక పెద్ద కాంప్లిమెంట్‌. సినిమాకు ఆదరణ ఎలా ఉన్నా తక్కువ బడ్జెట్‌లో రూపొందించడంతో ఇప్పుడు అందరూ హ్యాపీ. తక్కువ బడ్జెట్‌ చిత్రాలతోనే ప్రయోగాలు చేయగలం అని చెప్పుకొచ్చారు.

English summary
Director Narasimha Nandi says that he dont want to make a movie like Lajja.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu