»   » వివరణ ఇచ్చింది కదా..వదిలేయండి

వివరణ ఇచ్చింది కదా..వదిలేయండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

కోల్‌కతా: 'వాస్తవానికి గుజరాత్‌లోని వడోదరాకు వెళ్లినపుడు ప్రధాని నరేంద్రమోడీ వేషధారణలో అక్కడ తిరగాలనుకున్నాను. ఆ విధంగా ...నాదైన శైలిలో మన ప్రధానికి గౌరవాభివందనాన్ని సమర్పించాలనుకున్నాను. దురదృష్టవశాత్తూ కొందరి నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో వెనుదిరిగాను' అంటూ ప్రముఖ నటి విద్యాబాలన్‌ శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఆమె వివరణ ఇచ్చినా ఇంకా ఈ వివాదంపై మీడియాలోనూ,సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లోనూ వ్యతిరేకత వస్తూనే ఉంది. వివరణ ఇచ్చాక కూడా ఇంకా దానిపై వివాదం చేయటం అనవసరం అంటున్నారు బాలీవుడ్ వాసులు.

విద్యాబాలన్ మాట్లాడుతూ... తన కొత్త చిత్రం ప్రచారంలో భాగంగా గుజరాత్‌ వెళ్లానన్నారు. అక్కడి ఇతర కార్యక్రమాలతో పాటూ ప్రధానిమోడీ తరహా దుస్తులు ధరించి వడోదరాలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనాలనుకున్నట్లు ఆమె చెప్పారు. దానిపై వ్యతిరేకతలు వ్యక్తమైనాయనీ...ఎవరినీ నొప్పించడం తన కిష్టం లేదనీ...అందుకే, ఆ ఆలోచనకు స్వస్తిచెప్పానని విద్యాబాలన్‌ తెలిపారు. అందుకే, ఒక స్కూలులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వచ్చేసినట్లు ఆమె చెప్పారు.

Narendra Modi disguise my way of paying him tribute: Vidya Balan

ఆమె తన తాజా చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ డిటెక్టివ్‌ వేషధారణలో పాఠశాలకు వెళ్లారు. పిల్లలు తనను మొదట గుర్తించలేక పోయారనీ...తర్వాత తానెవరో తెలియడంతో ఎంతో ఆనందపడి పోయారన్నారు.

అందాల నటుడు అజిత్‌కు జంటగా బాలీవుడ్‌ భామ విద్యాబాలన్‌ నటించనుందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. 'ఆరంభం', 'వీరం' చిత్రాలతో ఘనవిజయాన్ని అందుకున్న అజిత్‌ ప్రస్తుతం గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో నటిస్తున్నారు. 'వీరం'తో తనకు గుర్తుండిపోయే హిట్‌ను అందించిన శివ దర్శకత్వంలో ఆయన మళ్లీ ఓ సినిమా చేయనున్నారు. ఇది కూడా మాస్‌ మసాలాగానే తెరకెక్కనున్నట్లు సమాచారం. ఇందులో అజిత్‌కు జంటగా నటించే హీరోయిన్‌ కోసం పలువురి పేర్లను పరిశీలించారట. చివరకు బాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్‌ విద్యాబాలన్‌ను ఎంపిక చేశారట. దీనిపై అధికారిక ప్రకటనే తరువాయని అజిత్‌ సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

English summary
“I didn’t want to politicise it. Whatever happened is unfortunate. I was only trying to pay tribute to a great Prime Minister in his city of Vadodara. I didn’t want to hurt anyone’s feelings and so I decided not to go,” Vidya Balan told reporters.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu