శ్రీరెడ్డి వివాదంలో ‘మా’ తప్పు చేసింది.. నిర్ణయాలు సరికావు.. నరేష్

By Rajababu

Recommended Video

Naresh Speaks On Sri Reddy Controversy

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) నిధుల అవకతవకలపై విభేదాలు రోడ్డున పడ్డాయి. మా అధ్యక్షుడు శివాజీరాజాపై సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. ఆయన నేతృత్వంలో నిధుల అవకతవకలు జరిగాయి అని విమర్శించారు. సోమవారం ఉదయం శివాజీరాజా నిర్వహించిన మీడియా సమావేశంలో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ ప్రెస్ మీట్లో శ్రీరెడ్డి వివాదాన్ని కూడా ప్రస్తావించారు. ఆయన ఏమన్నారంటే..

శ్రీరెడ్డి వివాదం సరికాదు

శ్రీరెడ్డి వివాదం సరికాదు

వివాదాస్పద నటి శ్రీరెడ్డి వ్యవహారంపై మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ వ్యవహరించిన తీరు సరికాదు. ఆ వివాదంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొన్నాం. మనల్ని మనమే దిగజార్చుకొన్నాం అని నరేష్ అన్నారు.

నిర్ణయాలు కరెక్ట్ కాదు..

నిర్ణయాలు కరెక్ట్ కాదు..

శ్రీరెడ్డిపై వేటు వేసిన నిర్ణయాన్ని ఉపసంహరించుకొన్నాం. ఆ తర్వాత ఆమెకు రాఖీ కట్టాం. వారంలోపలే అవన్నీ జరిగిపోయాయి. ఆ సమయంలో శ్రీరెడ్డికి వ్యతిరేకంగా తీసుకొన్న నిర్ణయాలు కరెక్ట్ కాదు.

మహేష్, ప్రభాస్ ఈవెంట్లు చేయను

మహేష్, ప్రభాస్ ఈవెంట్లు చేయను

త్వరలో విదేశాల్లో జరిగే మహేష్ బాబు, ప్రభాస్ ఈవెంట్లకు నేను బాధ్యుడిని కాదు. నన్ను లూప్ లైన్లో పెట్టారు. ఆ కార్యక్రమాలకు నన్ను కాదని, బెనర్జీని నాకు వ్యతిరేకంగా ఇన్‌ఛార్జిగా పెట్టారు. అందుకే నేను ఆ ఈవెంట్ల బాధ్యత తీసుకోవడం లేదు అని నరేష్ స్పష్టం చేశారు.

మా అసోసియేషన్‌లో ఎవరూ విడిపోలేదు

మా అసోసియేషన్‌లో ఎవరూ విడిపోలేదు

అవకతవకలపై పలుమార్లు సినీ పెద్దలకు చెప్పాం. వాళ్లు మాట్లాడి చర్యలు తీసుకొందామన్నారు. మా అసోసియేషన్‌లో ఎవరూ విడిపోలేదు. అన్నదమ్ముల్లో రకరకాలు ఉంటాయి అని నరేష్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X