»   » ప్రముఖ నటుడు నరేష్ ‘నవరసరాయ' సత్కారం

ప్రముఖ నటుడు నరేష్ ‘నవరసరాయ' సత్కారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహానటుడు దివంగత అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా రవీంద్రభారతిలోని శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ నటుడు నరేష్ కు అక్కినేని-శృతిలయ వెండి కిరీటం, నవరసరాయ సత్కార కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమలో తెలంగాణ రాష్ట్ర స్పీకర్ ముఖ్య అతిథిగా మధుసూదనాచారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ సమాజాన్ని ప్రభావితం చేసే మాధ్యమం సినిమా. ఒకప్పుడు సినిమాలు సందేశాత్మకంగా ఉండేవి. ఇప్పుడు అలాంటి సినిమాలు రావడం చాలా తగ్గిపోయాయన్నారు.

Naresh received Navarasa Raya award

శంకరాభరణం వంటి ఎన్నో గొప్ప సినిమాలు మన సంస్కృతిని దేశదేశాలకు వ్యాప్తి చేశాయి. ఎన్నో విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నరేష్ ను అక్కినేని పేరిట సత్కరించడం ఆనందంగా ఉంది'' అన్నారు. సతీసమేతంగా ఈ కార్యక్రమంలో నరేష్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కె.విశ్వనాథ్,జయసుధ, మ్యూజిక్ డైరెక్టర్ కోటి, కోదండరామిరెడ్డి, సురేష్ కొండేటి, జె.వి.రాజు, ఆర్.ఎన్.సింగ్ తదితరులు పాల్గొన్నారు.

English summary
Tollywood actor Naresh received Navarasa Raya award from Shruthilaya Arts Academy.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu