కృష్ణ-మహేష్ బాబు ఫ్యామిలీ నుండి మరో వారసుడు..

ఈ చిత్రానికి క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసోసియేట్ దర్శకుడిగా పని చేసిన రామ్‌ప్రసాద్ ఈ సినిమాకి దర్శకుడిగా పరిచయం కానున్నాడట. ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల ఈ సినిమాని నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం గురించి ప్రకటించారు చంటి అడ్డాల.
'నా గత చిత్రం అల్లరి నరేష్ హీరోగా నిర్మించిన 'యముడికి మొగుడు' తరువాత చేయబోయే చిత్రం కన్‌ఫర్మ్ అయ్యింది. ఈ చిత్రం ద్వారా సీనియర్ నరేష్ కొడుకు నవీన్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాం. ఇదొక ట్రయాంగిల్ లవ్‌స్టోరీ. చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతోంది. అన్ని పాటలూ ప్రముఖ కొరియోగ్రాఫర్ వైభవీ మర్చంట్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరణ చేయబోతున్నాం' అన్నారు చంటి అడ్డాల.


Click it and Unblock the Notifications











