»   »  షాక్: ముద్దు ముద్దుకు రేటు కడుతున్న హీరోయిన్

షాక్: ముద్దు ముద్దుకు రేటు కడుతున్న హీరోయిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పటి సినిమాల్లో లిప్ లాస్ సీన్లు కామన్ అయిపోయాయి. టాలీవుడ్, సౌత్ సినిమాలో కాస్త తక్కువే కానీ....బాలీవుడ్లో అయితే ప్రతి సినిమాలోనూ చుంబన సన్నివేశాలు తప్పనిసరి అయిపోయాయి. ఇందుకోసం హీరోయిన్లతో ముందే అగ్రిమెంటు చేసుకుంటారు.

 Nargis Fakhri found ridiculous to reshoot kissing scenes in ‘Azhar’ with Emraan Hashmi

ముద్దు సీన్లు ఒకే కానీ.... ఒక సీన్ కోసం వంద రీటేకులు చేయిస్తే మా పరిస్థితి ఏమిటి? అని వాపోతోంది బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రి. సినిమా అంగీకరించే ముందు ఇన్ని సీన్లు ఉన్నాయని చెబుతారు. కానీ షూటింగ్ సమయంలో సరిగా రాలేదని వందల సార్లు ముద్దు సీన్లు రీటేక్, రీ షూట్లు చేయిస్తున్నారంటూ మండి పడుతోంది. ఇందుకోసం మేము చాలా కష్టపడాల్సి వస్తోంది. అందుకే మళ్లీ మళ్లీ ఆ సీన్లు చేయాలంటే మాకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాలని వాదిస్తోంది.

 Nargis Fakhri found ridiculous to reshoot kissing scenes in ‘Azhar’ with Emraan Hashmi

బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హస్మి హీరోగా..... క్రికెటర్ అజారుద్దీన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'అజర్' చిత్రంలో నర్గీస్ ఫక్రి నటిస్తోంది. ఇందులో అజారుద్దీన్ రెండో భార్య, మోడల్ సంగీత బిజిలానీ పాత్రలో నర్గీస్ ఫక్కి నటిస్తోంది.

 Nargis Fakhri found ridiculous to reshoot kissing scenes in ‘Azhar’ with Emraan Hashmi

ఇప్పటికే ఇమ్రాన్ హస్మి, నర్గీస్ ఫక్రిలపై హాట్ హాట్ ముద్దు సీన్లు, పడకగది సీన్లు తీసారు. అయితే ఆ సీన్లు సరిగా రాలేదని రీ షూట్ చేయాలని నిర్ణయించారట. మళ్లీ చేయాలంటే తనకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిందే. ఇలాంటి సీన్లు చేయడం చాలా కష్టం, ఇబ్బంది కూడా. అందుకే మా కష్టానికి తగిన ప్రతిఫలంగా ఎక్కువ రెమ్యూనరేషన్ అడుగుతున్నామని తనను తాను సమర్దించుకుంటోంది నర్గీస్ ఫక్రి. అయితే నర్గీస్ ఫక్కి తీరు చూసి పలువురు నిర్మాతలు షాకవుతున్నాయి. హీరోయిన్లు ఇలాంటి కండీషన్లు పెడితే తమకు నష్టమే అంటున్నారు.

English summary
Nargis Fakhri says she found it ridiculous to do retakes of kissing scenes with co-star Emraan Hashmi in their upcoming film "Azhar".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu