»   » బాలీవుడ్ లో మళ్ళీ రేగిన వివాదం: మరోసారి సున్నితవిషయం మీద ఇద్దరు ప్రముఖ నటుల మాటల యుద్దం

బాలీవుడ్ లో మళ్ళీ రేగిన వివాదం: మరోసారి సున్నితవిషయం మీద ఇద్దరు ప్రముఖ నటుల మాటల యుద్దం

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  భారత దేశం లో ఎప్పుడూ రగులుతూనే ఉండే విషయం కాశ్మీర్ ఒకటైతే రెండోది ఇక్కడ ఉన్న రెండు ప్రధాన మతాల మధ్య ఉన్న ఒక విద్వేష ధోరణి. ఎప్పుడూ ఈ రెండు విషయాలు సంచలనాలకు దారి తీస్తూనే ఉంటాయి. ఈ విషయం లో ఏ సెలబ్రిటీ ఏ వ్యాఖ్య చేసినా దుమారం రేగుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా తాజా గా ఇదే విశయం మళ్ళీ కదిలింది. ఇద్దరు సినీ ప్రముఖుల మధ్య మాటల యుద్దానికి తెర తీసింది....

  కశ్మీరు పండిట్ల విషయంలో బాలీవుడ్ ప్రముఖులు అనుపమ్ ఖేర్, నసీరుద్దీన్ షా మాటల యుద్ధానికి దిగారు. తన తాజా చిత్రం "వెయిటింగ్‌" ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల ఢిల్లీలో నసీరుద్దీన్‌ షా అనుపమ్‌ ఖేర్‌పై విమర్శనాస్త్రాలు సంధించాడు. "ఎన్నడూ కశ్మీర్‌లో నివసించని వ్యక్తి కశ్మీర్‌ పండిట్ల కోసం పోరాటం ప్రారంభించాడు. నిజానికి ఆయనే ఓ నిర్వాసితుడైనట్టు వ్యవహరిస్తున్నాడు" అని షా పేర్కొన్నాడు.

  ఇలా నసీరుద్దీన్ ఆ మాటలన్నాడో లేదో వెంటనే అనుపం ఖేర్ ట్విట్టర్‌లో బదులిచ్చాడు. "జయహో షా గారు. మీ లాజిక్ ప్రకారం ఎన్నారైలు ఇండియా గురించి మాట్లాడవద్దన్న మాట" అని వ్యంగ్యంగా సమాధానం చెప్పాడు. కశ్మీరు పండిట్ల తరపున అనుపమ్ ఖేర్ పోరాడుతున్న విషయం తెలిసిందే.

  Naseeruddin Shah, Anupam Kher spar over Kashmiri Pandits

  గత నెలలో ప్రధాన మంత్రి మోదీని ఆయన కలిసి నిర్వాసితులైన కశ్మీరు పండిట్ల కోసం కశ్మీరు లోయలో మొదటి స్మార్ట్ సిటీని నిర్మించాలని కోరారు. జమ్మూ-కశ్మీరుకు చెందని భారతీయులు ఆ రాష్ట్రంలో ఆస్తులను, భూములను కొనుగోలు చేయడంపై నిషేధం విధిస్తున్న భారత రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేయాలని అనుపమ్ ఖేర్ చెప్పారు.

  భారతదేశంలో దాదాపు 62 వేల కశ్మీరు పండిట్ కుటుంబాలు ఉన్నాయి. వీరిపై 1990వ దశకంలో ఉగ్రవాదుల దాడులు పెరగడంతో కశ్మీరు లోయను విడిచిపెట్టి వలసపోయారు. కశ్మీరు పండిట్ల పునరావాసం కోసం మూడు ప్రాంతాలను గుర్తించినట్లు రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. మోదీ ప్రభుత్వం వీరి పునరావాసం కోసం రూ.500 కోట్లు కేటాయించింది.

  అదే సమయం లో అనుపం ఖేర్‌కు బాలీవుడ్ ప్రముఖులు అశోక్ పండిట్‌, మాధుర్ బండార్కర్‌ లు మద్దతు పలికారు. ఖేర్‌కు నసీరుద్దీన్ షా క్షమాపణ చెప్పాలని దర్శకుడు అశోక్ పండిట్ డిమాండ్ చేశారు. తమదైన శైలిలో నసీరుద్దీన్ పై విరుచుకుపడ్డారు. ఇక ఈ దాడితో పాపం నసీరుద్దీన్ వెనక్కి తగ్గక తప్పలేదు.

  దీంతో నసీరుద్దీన్ షా స్పందిస్తూ ఖేర్‌ను ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించారని వివరణ ఇచ్చాడు.అనుపమ్‌ను ఉద్దేశించి నసీరుద్దీన్ షా మాట్లాడుతూ కశ్మీరులో ఎన్నడూ నివసించని వ్యక్తి కశ్మీరు పండిట్ల కోసం పోరాటం ప్రారంభించాడని ఎగతాళి చేశారు. హఠాత్తుగా ఆయన నిర్వాసితుడైపోయాడని వ్యంగ్యంగా అన్నారు. 'వెయిటింగ్' రిలీజ్ సందర్భంగా ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

  English summary
  A war of words has broken out between two well-known Bollywood actors, Naseeruddin Shah and Anupam Kher, over who can fight for Kashmiri Pandits.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more