»   » బాలయ్య 102: నయనతారతో పాటు ఈ కొత్త బ్యూటీ కూడా (ఫోటోస్)

బాలయ్య 102: నయనతారతో పాటు ఈ కొత్త బ్యూటీ కూడా (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

'గౌతమీపుత్ర శాతకర్ణి' తో 100 సినిమాలు పూర్తి చేసి మంచి జోస్ మీద ఉన్న బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ దూసుకెలుతున్నారు. ఆ సినిమా తర్వాత 101వ సినిమాగా పూరితో 'పైసా వసూల్' చేసిన బాలయ్య..... 102వ చిత్ర ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తో చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే నయనతార ఎంపికవ్వగా, తాజాగా 'నటాషా దోషి' అనే మరో బ్యూటీని ఎంపిక చేశారు.

నటాషా దోషి

నటాషా దోషి

బాలయ్య 102లో సెకండ్ హీరోయిన్‌గా 'నటాషా దోషి' ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటించింది. కథానాయికగా నటాషా దోషికి మలయాళంలో మంచి గుర్తింపు ఉది.

తెలుగులో తొలిసారి

తెలుగులో తొలిసారి

నటాషా దోషి మళయాలంలో చాలా సినిమాలు చేసింది. 'హైడ్ అండ్ సీక్' .. 'మాంత్రికన్' .. 'నయన' .. 'కాల్ మీ @' .. 'ఫర్ సెల్' వంటి సినిమాలు ఆమెకి మంచి పేరు తెచ్చాయి. బాలకృష్ణ సినిమాతోనే ఆమె తెలుగు తెరకి పరిచయమవుతోంది. త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ కానుంది.

షూటింగులో నయనతార

షూటింగులో నయనతార

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూటింగులో బాలయ్యతో పాటు నయనతార కూడా పాల్గొంటోంది. మలయాళ భాషల్లో బిజీగా వున్న నయనతార, ఈ సినిమా కోసం పారితోషికంగా భారీ మొత్తమే తీసుకుందనే టాక్ వినిస్తోంది.

బాలయ్య 102

బాలయ్య 102

బాలకృష్ణ, నయనతార, నటాషా దోషి హీరో హీరోయిన్లుగా చేస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, అశుతోష్ రాణా, మురళీమోహన్, బాహుబలి ప్రభాకర్, శివపార్వతి తదితరులు ఇతరముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ భారీ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, యాక్షన్: అంబరీవ్, కెమెరా: సి.రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, కో-ప్రొడ్యూసర్‌: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: సి.తేజ, సి.వరుణ్‌కుమార్‌, నిర్మాత: సి.కళ్యాణ్‌, దర్శకత్వం: కె.ఎస్‌.రవికుమార్‌.

English summary
Nandamuri Balakrishna’s #NBK102 has one more glamorous attraction. Malayalam actress Natasha Doshi has joined Balayya Babu as one more heroine in the ongoing schedule under KS Ravikumar direction. As we informed earlier, Nayantara joined the shoot before and now Natasha Doshi took part in the whole massive schedule happening in RFC and other Hyderabad locations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu