»   » మీడియా వర్సెస్ వర్మ :సర్కార్3 ని చీల్చి చెండాడుతున్నారు

మీడియా వర్సెస్ వర్మ :సర్కార్3 ని చీల్చి చెండాడుతున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మీడియా కీ రామ్ గోపాల్ వర్మకీ కోల్డ్ వార్ అందరికీ తెలిసిందే ఈపుడెప్పుడు దొరుకుతాడా అని చూస్తూనే ఉంటారు విలేకరులు, ఎప్పుడే విషయాన్ని చూపి సెటర్ వేద్దామా అని చూస్తూంటాడు వర్మ. అందుకే వర్మని ఎప్పుడు దెబ్బ కొడదామా అన్నట్లు చూసే నేషనల్ మీడియా..

ముంబయి దాడులు జరిగినపుడు

ముంబయి దాడులు జరిగినపుడు

అప్పట్లో ముంబయి దాడులు జరిగినపుడు మహారాష్ట్ర సీఎం విలాస్ రావ్ దేశ్ ముఖ్ వెంట వర్మ వెళ్లడం మీద తీవ్ర దుమారం రేపే కథనాలు ప్రసారం చేసింది. అంతేనా వర్మ ప్రైవేట్ పార్టీల్లో చేసే ఎంజాయ్ ని కూడా చూపెట్టి పరువు గంగలో కలిపేసింది. ముజ్రాడాన్స్ లూ వోడ్కా గ్లాసులతో ఉన్న వర్మని చూపిస్తూ నానా హంగామా చేసింది.

రణ్

రణ్

అంతే ఎక్కడో మండిన వర్మ ‘రణ్' పేరుతో మీడియా వాళ్లు టీఆర్పీ రేటింగుల కోసం ఎలా వ్యవహరిస్తారో చూపిస్తూఏకంగా ఓ సినిమానే తీసి పడేసాడు. నిజానికి రణ్ మరీ అంత దారుణం గా ఏం ఉండదు. అయినా సరే మీడియా ఆ సినిమాని రకరకాల వింత కథనాలు రాస్తూ దారునంగా ఫ్లాప్ దిశగా నడిపేసి గంగలో కలిపేసిందన్న వాదనా ఉంది. పాపం ఇంకా రగిలి పోయిన వర్మ మీడియా ని సందు దొరికినప్పుడల్లా ఉతి ఆరేస్తూ వచ్చాడు.

సర్కార్-3

సర్కార్-3

సరే..! అదంతా గతం ఇప్పుడు ఆ గొడవలన్నీ ఎందుకు గుర్తు చేసుకోవటం ఎందుకూ అంటే... ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ నుంచి ‘సర్కార్-3' వచ్చింది. ఈ సినిమా గురించి అనౌన్స్ చేసిన దగ్గర్నుంచీ సినిమాని నంచుకు తినటం మొదలు పెట్టాయ్. పోయి పోయి అమితాబ్ బచ్చన్ వర్మతో ఇప్పుడు సినిమా చేశాడేంటంటూ చాలాసార్లు మీడియా వాళ్లు గిల్లుతూనే ఉన్నారు.

యా చేతికి వజ్రాయుధం

యా చేతికి వజ్రాయుధం

అసలు ‘సర్కార్-3'కి అనుకున్నంత హైప్ రాకపోవడానికి వర్మ మాత్రమే కాదు ఈ సినిమా ఒక డబ్బా సినిమా అని జనాన్ని మెంటల్ గా ఫిక్స్ చేసేసారు. ఇక సినిమా బయటికి రావటమూ దానికి కాస్త నెగెటివ్ రిపోర్ట్ రావటమూ మీడియా చేతికి వజ్రాయుధం అయ్యింది.

డిసెక్ట్ చేసి పడేస్తున్నారు

డిసెక్ట్ చేసి పడేస్తున్నారు

ఇక సినిమాని పోస్త్మార్ట్రం కాదు డిసెక్ట్ చేసి పడేస్తున్నారు. నిన్న మార్నింగ్ షో పడ్డప్పటి నుంచి నేషనల్ పత్రికలకు సంబంధించిన వెబ్ సైట్లు.. అలాగే టీవీ ఛానెళ్లలో ‘సర్కార్-3' మామూలుగా కాదు. స్పెషల్ ప్రోగ్రాం లు పెట్టి మరీ ఆడుకుంటున్నారు. రాజీవ్ మసంద్ లాంటి ప్రముఖ క్రిటిక్ కూడా ‘సేమ్ షేమ్' అంటూ క్యాప్షన్ పెట్టి మరీ ‘సర్కార్-3'ని ఉతికారేసాడు.

‘సర్కార్-3’ అట్టర్ ఫ్లాప్

‘సర్కార్-3’ అట్టర్ ఫ్లాప్

ఆయన 2 రేటింగ్ ఇస్తే.. కొందరు 1.5 రేటింగ్స్ కూడా ఇచ్చారు. ఏకమొత్తంగా ‘సర్కార్-3' అట్టర్ ఫ్లాప్ అని తొలి రోజే తీర్పు చెప్పేసారు. అసలే ఓపెనింగ్స్ లేని ఈ సినిమా.. ఈ వ్యతిరేక ప్రచారంతో ఇంకో రెండు మూదు రోజులు కూడా థియేటర్ల లో ఉండే పరిస్థితి కనిపించటం లేదు.... ఇది మరీ దారుణం కదా... పాపం వర్మ

English summary
We all knew that a cold war is running between National Media and bollywood Director Ram gopal varma, ofter Sarkar 3 they giving bad report about the Movie
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu