»   » నాని నిర్ణయం నిర్మాతలకు పిడుగుపాటే, చిన్న సినిమాలకు అందుబాటులోలేనట్టేనా..?

నాని నిర్ణయం నిర్మాతలకు పిడుగుపాటే, చిన్న సినిమాలకు అందుబాటులోలేనట్టేనా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు, గాడ్ ఫాదర్లు లేరు వచ్చిన వెంటనే ఎర్రతివాచీలు పరిచి ఆహ్వానం పలకలేదు అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తూనే భీమిలి కబడ్డి జట్టు లాంటి సినిమా తో కొంత కొంత గుర్తింపు తెచ్చుకుంటూ ఇప్పుడు చిన్న నిర్మాతల పాలిటి మెగాస్టార్ గా పిలిపించుకుంటున్న నేచురల్ స్టార్ నానీ అంత ఈజీగా ఏం ఎదగలేదు.

నానికూడా తన రేటు పెంచాడు

నానికూడా తన రేటు పెంచాడు

నిన్నా మొన్నటి వరకూ నానీ రెమ్యున రేషన్ కూడా మరీ ఎక్కువేం కాదు. అయితే ఇప్పుడు మాత్రం కాస్త పంథా మారినట్టే కనిపిస్తోంది. దీపం ఉండగానే ఇల్లూ, క్రేజ్ ఉన్నప్పుడే కెరీరూ సరిదిద్దుకోవాలన్నట్టు నానికూడా తన రేటు పెంచాడు. భలె భలె మగాడివోయ్ విజయం తర్వాత మూడుకోట్లు అడిగిన నానీ

నేను లోకల్‌’ తర్వాత

నేను లోకల్‌’ తర్వాత

ఇప్పుడు తన రేటు అమాంతం ఇంకో రెండు పెంచాడట. "నేను లోకల్‌" తర్వాత నాని ఐదు కోట్ల రూపాయలు డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం. నాని ఇమేజ్‌, మార్కెట్‌ దృష్ట్యా ఈ రేంజ్‌ రెమ్యునరేషన్‌ సమంజసమే. ఈ లెక్కన ఈ ఏడాది మూడు సినిమాలతో నాని సంపాదన 15 కోట్ల రూపాయలట.

ఈ ఏడాది మూడు సినిమాలు

ఈ ఏడాది మూడు సినిమాలు

నాని ఈ ఏడాది దాదాపు మూడు సినిమాలు చేయబోతున్నాడు. ప్రస్తుతం డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ‘నిన్ను కోరి' అనే సినిమాలో చేస్తున్నాడు నాని. ఆ తర్వాత దిల్‌ రాజు సినిమా అంగీకరించాడు. అది పూర్తయిన తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించనున్నాడు.

బాహుబలి నిర్మాతల బ్యానర్లో

బాహుబలి నిర్మాతల బ్యానర్లో

ఈ మూడు సినిమాలు ఈ ఏడాదే తెరకెక్కనున్నాయి. ఆ తర్వాత ‘బాహుబలి' నిర్మాతల బ్యానర్లో ఓ సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడట నాని. ఆ సినిమాకుగానూ నానికి భారీ పారితోషికం దక్కబోతునట్టు సమాచారం. ‘బాహుబలి' ప్రీ రిలీజ్ వేడుకలో నాని కనిపించడానికి అది కూడా ఓ కారణం అంటున్నారు సినీజనాలు. అదండీ సంగతి స్టార్ అయిపోవటం అంటే మాటలు కాంట్టే స్టార్ రేంజ్ రెమ్యునరేషన్ కూడా మాటలు కాదు మరి...కోట్లతో వ్యవహారమే అంతా....

English summary
It's said that many producers are willing to pay 4 to 5 Crore as Nani's remuneration and giving advance amounts to get Nani's dates. Although Nani isn't said to be demanding much about his pay, producers themselves are apparently ready to pay to get the actor on board.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu