»   » డ్రగ్స్ 'బాదితుల" షో కానుందాఅంటూ జోకులు: బిగ్ బాస్ హౌస్ లోకి నవదీప్

డ్రగ్స్ 'బాదితుల" షో కానుందాఅంటూ జోకులు: బిగ్ బాస్ హౌస్ లోకి నవదీప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బిగ్‌బాస్ హౌస్‌లోకి హీరో నవ్‌దీప్ ఎంటరయ్యాడు. నిన్న మహేశ్ కత్తి, నేడు కల్పన ఎలిమినేట్ కావడంతో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చేశాడు. వాస్తవానికి నిన్ననే నవ్‌దీప్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చేస్తాడని అంతా భావించారు. అయితే శనివారానికి బదులుగా ఆదివారం ఎంట్రీ ఇచ్చాడు. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో సిట్ ముందు విచారణకు హాజరైన నవ్‌దీప్.. ముమైత్ ఖాన్‌లాగే బిగ్‌బాస్ ద్వారా జనం ముందుకు వచ్చాడు.

కొద్దిగా ఛేంజెస్

కొద్దిగా ఛేంజెస్

ప్రతివారం ఒకరిని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ లో కొద్దిగా ఛేంజెస్ చేస్తున్నారు. ఇద్దరిని బయటకు పంపిస్తారు. శనివారం మధ్యాహ్నం ఓటింగ్ వివరాలు పూర్తిగా వచ్చిన తరువాత బయటకు పంపే ఇద్దరిని డిసైడ్ చేసి, ఆదివారం రాత్రి ఎపిసోడ్ లో ప్రకటిస్తారు. షూట్ మాత్రం ఎప్పటిలాగే ఒక రోజు ముందుగా తయారవుతుంది.

Bigg Boss Telugu : Rana Daggubati grand entry For Nene Raju Nene Mantri promotions
నవదీప్ తోడయ్యాడు

నవదీప్ తోడయ్యాడు

ఇప్పటికి ప్రిన్స్ ఒక్కడే కాస్త యంగ్ బాయ్ ఈ షో లో వున్నాడు. ఇప్పుడు నవదీప్ తోడయ్యాడు. టీవీ షో ల నిర్వహణలో అనుభవం వున్న నవదీప్ బిగ్ బాస్ హవుస్ లో ఏ మేరకు సందడి చేస్తారో చూడాలి. అయితే ఇప్పటికే డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్న ముమైత్ అక్కడే ఉందగా అదే కేసులో విచారణ ఎదుర్కొంటున్న నవదీప్ కూదా అక్కడికే రావటం తో "బిగ్ బాస్ దీ అడిక్షన్ సెంటర్" అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయ్

దీక్షా పంత్‌

దీక్షా పంత్‌

బిగ్‌ బాస్‌ హౌస్‌లో కంటెస్టంట్ల సంఖ్య తగ్గేకొద్ది వైల్డ్‌కార్డు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. గతంలో జ్యోతి, మధు ప్రియ ఎలిమినేట్‌ అవగానే గోపాల గోపాల సినిమా ఫేం దీక్షా పంత్‌ బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగు పెట్టింది. గతవారం కూడా సమీర్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. అయితే షోలోకి కొత్తగా ఎవరో ఒకరు ఎంట్రీ ఇస్తారని ప్రేక్షకులు అనుకున్నారు.

క‌త్తి మ‌హేష్‌, సింగ‌ర్ క‌ల్ప‌న

క‌త్తి మ‌హేష్‌, సింగ‌ర్ క‌ల్ప‌న

దీనిపై పలు రూమర్లు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. అనుకున్నట్లుగానే మరొక నవదీప్‌ షోలో అడుగు పెట్టేసాడు. ఈ వారం డ‌బుల్ ద‌మాకాలో ఇద్ద‌రి ఎలిమినేష‌న్ జ‌రిగింది. క‌త్తి మ‌హేష్‌, సింగ‌ర్ క‌ల్ప‌న ఈ వారం బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే క‌ల్ప‌న బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన ఎపిసోడ్ ఎంట‌ర్‌టైనింగ్‌గా నిలిచింది.

మంట పుట్టే అవ‌కాశాలు

మంట పుట్టే అవ‌కాశాలు

హౌస్‌లో ఉన్న‌ప్పుడు ఒక‌లా...బ‌య‌ట మ‌రొక‌లా క‌ల్ప‌న ప్ర‌వ‌ర్తించిన తీరు వీక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. మొత్తానికి బిగ్‌బాస్ హౌస్‌లో న‌వ‌దీప్ ఎంట్రీతో మంట పుట్టే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. ఇన్నాళ్లు సోలో సోగ్గాడు ప్రిన్స్‌కి బ్యాండ్ ప‌డిన‌ట్లే. ఎందుకంటే న‌వ‌దీప్ ఎక్స్‌ట్రా కారిక్యుల‌ర్ యాక్టివిటీలో స్పీడ్‌.

క‌ష్టాలు మొద‌ల‌వుతాయి

క‌ష్టాలు మొద‌ల‌వుతాయి

నవదీప్ ఎంట్రీ తో ఇన్నాళ్లు ఎదురులేకుండా పోయిన ప్రిన్స్‌కి ఇప్పుడు క‌ష్టాలు మొద‌ల‌వుతాయి. దీంతో పాటు బిగ్‌బాస్‌లో కొంచెం మ‌సాలా యాడ్ అవుతుంది. గొడ‌వ‌లు,అల‌క‌లు,మాట‌ల యుద్ధం ఇంకా ముదిరే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి. అంతే కాదు కాస్త వైల్డ్ గా వివాదాస్పదంగా ఉంటాడు. ఇక ఇతను రచ్చ మొదలు పెడితే బిగ్ బాస్ హౌస్ టీఆర్పీల్లో కొట్తుకుపోవాల్సిందే అంటూ చెబుతున్నారు.

English summary
After the Wild Card Entry of Diksha Panth Here's one more contestant all set to enter into the Bigg Boss Telugu House. See who entered as a Wild Card Contestant in Big Boss Telugu House. Navdeep is the Man who gets Wild Card entry into Jr. NTR's Show
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu