»   » నవదీప్, కిమ్‌ శర్మ బార్‌లో వెయిటర్లు

నవదీప్, కిమ్‌ శర్మ బార్‌లో వెయిటర్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవన్ కళ్యాణ్ తో తమ్ముడు వంటి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు పిఎ అరుణ్ ప్రసాద్ 'యాగం' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. నవదీప్, భూమిక, కిమ్‌ శర్మ కాంబినేషన్‌తో తయారవుతున్న ఈ చిత్రం ఈనెల 19న విడుదలవుతోంది. ఈ చిత్రంలో నవదీప్, కిమ్‌శర్మ బార్‌లో వెయిటర్లుగా కనిపిస్తారు. భూమిక ఎయిర్‌హోస్టెస్ పాత్రను ధరించారు. ప్రధానంగా ఈ ముగ్గురి మీదే కథ నడుస్తుంది. అలా అని ఇది ముక్కోణ ప్రేమకథా చిత్రం కాదు. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్. తానింకా బతికి ఉన్నాడంటే ఒక యాగం చేయడానికేనని నమ్మే యువకుడి పాత్ర నవదీప్‌ది. ఇక ఈ చిత్రం షూటింగ్‌ని ఎక్కువ శాతం బ్యాంకాక్‌లో జరిపారు. భూమిక భర్త భరత్ ఠాకూర్ సమర్పకుడిగా డౌన్‌టౌన్ ఫిలిమ్స్ పై నిర్మించారు. ఈ చిత్రం మిగతా పాత్రల్లో అజయ్, బ్రహ్మానందం, అలీ, రాహుల్‌దేవ్, హర్షవర్థన్ నటించారు. అలాగే ఈ చిత్రానికి పాటలు భాస్కరభట్ల, అనంత్ శ్రీరామ్ అందించగా సంగీతాన్ని మణిశర్మ అందిస్తున్నారు. ఇక కెమెరాని భరణి కె.ధరన్, ఎడిటింగ్ మార్తాండ్ కె.వెంకటేష్ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu