»   » నాని ఫ్రెండే ఇప్పుడు విలన్.... మరో ప్రయోగం లో యువ హీరో

నాని ఫ్రెండే ఇప్పుడు విలన్.... మరో ప్రయోగం లో యువ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ హీరో నాని కేరీర్ ఇప్పుడు సూప‌ర్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. గ‌తేడాది వ‌చ్చిన ఎవడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్, ఈ యేడాది ఆరంభంలో వ‌చ్చిన కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాల‌తో హ్యాట్రిక్ హిట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక తాజాగా మోహ‌న్‌కృష్ణ ఇంద్ర‌గంటి డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన జెంటిల్‌మ‌న్ సినిమాతో మ‌రో థ్రిల్ల‌ర్ హిట్ కొట్టాడు. భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీరప్రేమ గాథ, జెంటిల్‌మన్ వంటి హ్యాట్రిక్ విజయాలు అందుకున్న నాని రెమ్యునరేషన్ సైతం ఇప్పుడు 7 కోట్ల రూపాయల వరకు చేరుకుంది.

నాని హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ పాత్ర ప్రత్యేకంగా ఉండనుందట. సినిమాలో ప్రాధాన్యత కలిగిన ఈ పాత్రకు నవీన్ చంద్ర అయితే బావుంటుందని దర్శక, నిర్మాతలు భావించి నవీన్ సంప్రదించినట్టు సమాచారం. కథ, తన పాత్ర వివరాలు తెలుసుకున్న నవీన్ హీరోగా చేస్తున్న సమయంలో ఈ సినిమా చేయాలా... వద్దా..? అన్న మీమాంసలో పడ్డాడట.

Naveen Chandra turns villain for Nani

అయితే ఈ చిత్రాన్ని నిర్మించనున్నది అగ్ర నిర్మాత అయిన దిల్ రాజు గనక నవీన్ ఈ పాత్రకు 'ఎస్' చెప్పేసాడని టాక్. ఈ మూవీని ఎక్కువ భాగం కర్నూలు.. విజయవాడల్లో షూటింగ్ జరిపేలా ప్లాన్ చేశారు ఇదే జరిగితే సీనియర్ హీరోల మాదిరి యువ హీరోలు కూడా విలన్‌లుగా మారి టాలీవుడ్ మరో కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టినట్టవుతుంది. ఇప్పటికే నవదీప్, సుధీర్ తదితరులు ఆ జాబితాలో చేరగా ఇప్పుడు నవీన్ వంతు.

English summary
Hero Naveen chandra Looks like he has now changed his track and has decided to go the other way round. Naveen has now agreed to be a part of Nani's upcoming film which will be helmed by Dil Raju.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu