»   » అప్పుడు వెయిటర్...ఇప్పుడు సినిమా హీరో అయ్యాడు

అప్పుడు వెయిటర్...ఇప్పుడు సినిమా హీరో అయ్యాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : ‘అందాల రాక్షసి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో నవీన్ చంద్ర.....ఈ రోజు ‘దళం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే నవీన్ ఈ స్థానానికి చేరుకోవడానికి పడ్డ కష్టాలు, నటుడు కావాలనే ప్రయత్నంలో జీవనోపాధి కోసం చేసిన పనులు గురించి తెలుసుకుంటే ఆశ్యర్యం కలుగక మానదు. మంచి ఫిజిక్, చూడచక్కని రూపం ఉండటంతో పాటు నటించాలనే ఆకాంక్ష నవీన్‌ను హైదరాబాద్ వైపు అడుగులు వేయించింది. 2003లో నటుడినికావాలనే ఆకాంక్షతో హైదరాబాద్ వచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ కావడం అంత సులభమేమీ కాదు. ఈ ప్రయత్నంలో ఎందరినో కలవడంతో పాటు, ఎన్నో కష్టాలు పడ్డాడు నవీన్. తప్పనిసరి పరిస్థితుల్లో కడుపునింపుకోవడం కోసం ఫేమస్ ఆల్ఫా కేఫ్‌లో వెయిటర్‌గా పని చేసాడు. న్యూస్ పేపర్లు, మిల్క్ ప్యాకెట్లు డెలివరీ చేసాడు. యానిమేషన్ సంస్థలో కొంతకాలం పని చేసిన తర్వాత రమణానంద్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌లో డాన్స్ ఇన్‌స్టక్టర్‌గా పని చేసాడు. ఈ క్రమంలో తమిళ సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. అలా అందాల రాక్షసి సినిమా దర్శకుడు హను రాఘవపూడి కళ్లలో పడి అందులో హీరోగా నటించాడు. అలా నటుడిని కావాలనే లక్ష్యాన్ని చేరుకున్నాడు. నవీన్ చంద్ర రెండో చిత్రం 'దళం' ఈ రోజు విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర నక్సలైట్ గా కనిపించనున్నారు. జీవన రెడ్డి అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్నారు. నవీన్ చంద్ర సరసన పియాబాజ్‌పేయ్ కనిపించనుంది. జన జీవన స్రవంతిలో కలిసి నక్సలైట్ల జీవితం ఎలా సాగిందనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది.
హైదరాబాద్ : 'అందాల రాక్షసి' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో నవీన్ చంద్ర.....ఈ రోజు 'దళం' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే నవీన్ ఈ స్థానానికి చేరుకోవడానికి పడ్డ కష్టాలు, నటుడు కావాలనే ప్రయత్నంలో జీవనోపాధి కోసం చేసిన పనులు గురించి తెలుసుకుంటే ఆశ్యర్యం కలుగక మానదు.

మంచి ఫిజిక్, చూడచక్కని రూపం ఉండటంతో పాటు నటించాలనే ఆకాంక్ష నవీన్‌ను హైదరాబాద్ వైపు అడుగులు వేయించింది. 2003లో నటుడినికావాలనే ఆకాంక్షతో హైదరాబాద్ వచ్చారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ కావడం అంత సులభమేమీ కాదు. ఈ ప్రయత్నంలో ఎందరినో కలవడంతో పాటు, ఎన్నో కష్టాలు పడ్డాడు నవీన్.

తప్పనిసరి పరిస్థితుల్లో కడుపునింపుకోవడం కోసం ఫేమస్ ఆల్ఫా కేఫ్‌లో వెయిటర్‌గా పని చేసాడు. న్యూస్ పేపర్లు, మిల్క్ ప్యాకెట్లు డెలివరీ చేసాడు. యానిమేషన్ సంస్థలో కొంతకాలం పని చేసిన తర్వాత రమణానంద్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌లో డాన్స్ ఇన్‌స్టక్టర్‌గా పని చేసాడు. ఈ క్రమంలో తమిళ సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. అలా అందాల రాక్షసి సినిమా దర్శకుడు హను రాఘవపూడి కళ్లలో పడి అందులో హీరోగా నటించాడు. అలా నటుడిని కావాలనే లక్ష్యాన్ని చేరుకున్నాడు.

నవీన్ చంద్ర రెండో చిత్రం 'దళం' ఈ రోజు విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో నవీన్ చంద్ర నక్సలైట్ గా కనిపించనున్నారు. జీవన రెడ్డి అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్నారు. నవీన్ చంద్ర సరసన పియాబాజ్‌పేయ్ కనిపించనుంది. జన జీవన స్రవంతిలో కలిసి నక్సలైట్ల జీవితం ఎలా సాగిందనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది.

English summary
It might be a bed or roses for most of the young generation heroes to make their debut in the Tollywood as lot of them have a strong filmy background, but it took almost 9 year for Naveen Chandra to become a hero. Naveen Chandra came to Hyderabad in the year 2003 and after running out of money, he started delivering newspapers, milk packets and later on worked as a waiter in Alpha café for about a year to earn money.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu