»   » 'నేను శైలజ'పై పాజిటివ్ కామెంట్‌కు చానెల్ జాబ్ ఫట్: సారీ చెప్పిన హీరో రామ్

'నేను శైలజ'పై పాజిటివ్ కామెంట్‌కు చానెల్ జాబ్ ఫట్: సారీ చెప్పిన హీరో రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరో రామ్, కీర్తి సురేష్ జంటగా నటించిన నేను శైలిజ సినిమాకు అనుకూలంగా వ్యాఖ్య చేసినందుకు నవీన్ అనే వ్యక్తి ఉద్యోగం ఊడింది. దానికి హీరో రామ్ సారి చెబుతూ... అతనికి వేరొక ఉద్యోగం వచ్చే వరకు తన ఆఫీసు నుండి అతనికి సాలరీ ఇస్తానని రామ్ హామీ ఇచ్చారు. అయితే కొన్ని రోజుల క్రితం నేను శైలజ చిత్రం వ్యతిరేకంగా ఓ చానెల్ రివ్యూను ప్రసారం చేసింది. దీనిపై రామ్ శైలిలో స్పందించారు.

ఆ ఒక్క ఛానల్ తప్ప ప్రపంచవ్యాప్తంగా తమ సినిమానే అందరూ ఆదరిస్తున్నారని రామ్ తన ట్విట్టర్‌లో తెలిపారు. అయితే ఆ సినిమా వల్ల ఆ ఛానెల్‌లో పనిచేసే నవీన్ అనే వ్యక్తి ఉద్యోగం ఊడింది. నవీన్ రామ్‌కు అభిమాని.అయితే, ఛానెల్ ఇచ్చిన 'నేను శైలజ' రివ్యూను వ్యతిరేకిస్తూ ఈ చిత్రంపై నవీన్ పాజిటివ్ కామెంట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆగ్రహించిన ఛానల్ యాజమాన్యం నవీన్‌ను ఉద్యోగంలో నుండి తీసేసిందని ప్రచారం సాగుతోంది.ఈ విషయం తెలుసుకున్న రామ్ తన ట్విట్టర్‌లో వెంటనే ప్రతిస్పందించారు. ముందుగా నవీన్‌కు రామ్ సారీ చెప్పారు. అతనికి మరో ఉద్యోగం వచ్చే వరకు అతడికి జీతం తాను ఇస్తానంటూ ప్రకటించారు. అంతే కాకుండా, సమాజం ఎటుపోతుందో తనకు అర్ధం కావడం లేదని రామ్ అన్నారు. 'నేను శైలజ' రివ్యూ మీద మాట్లాడినందుకు జాబ్ తీసేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.హీరో రామ్ , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కిన నేను శైలజ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా, స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.


English summary
Hero Ram said sorry to a TV channel employee for loosing job for positive comment on Nenu Sailaja
Please Wait while comments are loading...