»   » ఎంపి వేధిస్తున్నాడంటూ హీరోయిన్ కంప్లైంట్

ఎంపి వేధిస్తున్నాడంటూ హీరోయిన్ కంప్లైంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Navneet Kaur Files Harassment Case
హైదరాబాద్: తెలుగుతో పాటు పలు దక్షిణాది సినిమాల్లో తన హాట్ అండ్ సెక్సీ గ్లామర్‌తో ఆకట్టుకున్న తార నవనీత్ కౌర్. రాబోయే ఎన్నికల్లో నవనీత్ కౌర్ ఎన్‌సిపి తరుపున పార్లమెంటుకు పోటీ చేసేందుకు రెడీ అవుతోంది. మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుండి శివసేన పార్టీ సిట్టింగ్ ఎంపీ ఆనంద్రో అడ్సుల్‌పై ఆమె పోటీకి దిగుతోంది.

తాజాగా నవనీత్ కౌర్.....తన ప్రత్యర్థిపై పోలీసులకు కంప్లైంట్ చేసింది. గత రెండు నెలల నుండి తనను అసభ్య పదజాలంతో ఆనంద్రో వేధిస్తున్నాడని, బెదిరింపుకాల్స్‌ చేస్తున్నాడని ఆమె తన పిర్యాదులో పేర్కొన్నారు. తన గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడని నవనీత్ కౌర్ ఆవేదన వ్యక్తం చేసారు.

నవనీత్ కౌర్ పిర్యాదు స్వీకరించామని, ఆమె ఫిర్యాదు మేరకు ఆయా సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు గడ్గే నగర్ పోలీసులు తెలిపారు. నవనీత్ కౌర్ ఫిర్యాదుపై 67 ఏళ్ల ఆనంద్రో స్పందిస్తూ ఆమె ఆరోపణలను ఖండించారు. 'తాను ఆమెపై ఎలాంటి వేధింపులు, బెదిరింపులకు పాల్పడలేదని, ప్రజల సింపథీ కోసమే ఇలా చేస్తోందని, ఆమె చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలే' అని తెలిపారు.

ఇంతకు ముందు కూడా నవనీత్ కౌర్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు అపఖ్యాతి తెచ్చేందుకు కొందరు తన ఫోటోలను దుర్వినియోగం చేసి ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగు సైట్లలో తప్పుడుగా ప్రచారం చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీన్ని వెంటనే అడ్డుకోవాలని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

English summary

 Actress Navneet Kaur-Rana, who is set to contest Parliamentary election from NCP, has registered a complaint against Shiv Sena Lok Sabha MP Anandrao Adsul and two others on Sunday. In her complaint, the South Indian actress has claimed that they have harassing her with abusive words and threatening calls for the last two months.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu