»   » వరకట్న వేదింపుల కేసులో హీరో... కట్నం కోసం మరదలిపై దాడి చేసాడంటూ

వరకట్న వేదింపుల కేసులో హీరో... కట్నం కోసం మరదలిపై దాడి చేసాడంటూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

నవాజుద్దీన్ సిద్ధిఖి.. గత కొన్నేళ్లలో బాలీవుడ్ కు దొరికిన అత్యంత గొప్ప నటుల్లో ఒకడు. గ్యాంగ్స్ ఆఫ్ వస్పీపూర్.. మాంఝీ.. రమణ్ రాఘవ్ 2.0 లాంటి సినిమాలు అతడి నట ప్రతిభకు తార్కాణంగా నిలుస్తాయి. నటనతో పాటు వ్యక్తిత్వంతోనూ ఆకట్టుకున్న నవాజుద్దీన్ సిద్దిఖిపై ఊహించని ఆరోఫనలు వచ్చాయి. కట్నం కోసం అతను తన సోదరుడి భార్య మీద దాడి చేసినట్లుగా అతను ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.


నవాజుద్దీన్ తమ్ముడు మినాజుద్దీన్ భార్య ఆఫ్రిన్.. తనకు వరకట్న వేధింపులు ఎదురవుతున్నాయని.. నవాజుద్దీన్ కట్నం కోసం తనపై దాడికి కూడా దిగాడని ఆరోపించింది. మూడు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా గతనెల 28వ తేదీన రాత్రి తనను ఇంటి నుంచి బయటకు వెళ్లాలని కోరుతూ తన కడుపుపై నవాజుద్దీన్ కొట్టాడని ఆఫ్రీన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మే 31వ తేదీన తాను మీనాజుద్దీన్‌ను పెళ్లాడానని అప్పటి నుంచి తనను అదనపు కట్నం తీసుకురమ్మని తన భర్తతో సహా అత్తింటివారు వేధిస్తున్నారని ఆఫ్రీన్ ఫిర్యాదు చేశారు. తన భర్త అసహజ సెక్స్ చేసేందుకు ప్రయత్నించాడని గర్భిణీ అయిన ఆఫ్రీన్ ఆరోపించారు. తనను భర్త మీనాజుద్దీన్ తోపాటు సినీనటుడు నవాజుద్దీన్, ఫయాజుద్దీన్, మజుద్దీన్, సైమాలు అదనపు కట్నం కోసం కొట్టి ఇంటినుంచి బయటకు వెళ్లగొట్టారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వార్తలు మీడియాలో ప్రముఖంగా హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నవాజ్ వివరణ ఇచ్చాడు.

Nawazuddin Siddiqui denies sister-in-law's allegations of torture

తనను సాఫ్ట్‌ టార్గెట్‌గా భావించి ఉద్దేశపూరితంగానే ఆమె ఈ ఆరోపణలు చేసిందని, తాను నటుడిని కావడంతో ఈ ఆరోపణలు చేయడం ద్వారా టీవీల్లో, పత్రికల్లో వెలుగులోకి రావొచ్చునని ఆమె భావించిందని చెప్పారు.,,కట్నం కోసం తన మరదల్ని ఎప్పుడూ వేధించలేదని తెలిపారు. నిజానికి ఆఫ్రిన్‌ మామే తన తమ్ముడు మినాజుద్దీన్‌ డబ్బు కోసం నిత్యం వేధించేవాడని చెప్పారు. సెప్టెంబర్‌ 28న తాను తీవ్ర జ్వరంతో ఉన్నానని, ఆఫ్రిన్‌ అత్త, మామ డబ్బు దొంగలించాలనే ఉద్దేశంతో ఆ రోజు తమ ఇంటికి వచ్చి గలాటా సృష్టించారని, అయినా తాను కొట్టడంగానీ, కనీసం ఆమెను తాకడం కానీ చేయలేదని, ఇందుకు సంబంధించిన సీసీటీవీ కెమెరా దృశ్యాలు కూడా ఉన్నాయని వివరించారు.

English summary
"I'm falsely charged by my sister-in-law because I'm a soft target for her and she could have easily made the news out of me. I'm an actor so, that could also be a reason for her allegations". Nawazuddin said during a press conference here.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu