»   » నాతో చేసే హీరోయిన్ కు... నెక్స్ట్ ఛాన్స్ రజనీతోనే

నాతో చేసే హీరోయిన్ కు... నెక్స్ట్ ఛాన్స్ రజనీతోనే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఆ నటుడుతో సినిమా చేస్తే నెక్ట్స్ ఛాన్స్ రజనీకాంత్ తో వస్తుందట. ఈ విషయం చెప్తున్నది బాలీవుడ్ నటుడు నవాజుద్దిన్ సిద్దికి. ఆయన తన తాజా చిత్రం ఫ్రీకి అలీ ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పుకొచ్చాడు.

తనతో మాంఝీ చిత్రంలో హీరోయిన్ గా చేసిన రాధికా ఆప్టే ..రీసెంట్ గా రజనీ చిత్రం కబాలిలో చేసింది. అలాగే ఆయన తాజా చిత్రం ఫ్రీకి అలీ లో చేస్తున్న అమీ జాక్సన్..కు రోబో 2 లో అవకాసం వచ్చిందని అన్నారు. అయితే నిజానికి రోబో 2 లో చేస్తున్న అమీనే నవాజుద్దిన్ సిద్దికి ఫ్రీకి అలీలో బుక్ చేసుకున్నారు. అదన్నమాట సంగతి.

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ సమర్పణలో అతని సోదరుడు సోహైల్ ఖాన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'ఫ్రీకి అలీ'. ఈ చిత్రానికి రచయిత కూడా సోహైల్ ఖాన్ కావడం విశేషం. రొమాంటిక్ కామెడీ-స్పోర్ట్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. సల్మాన్ మరో సోదరుడు అర్బాజ్ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ, అమీజాక్సన్, జస్ అరోరా, సీమా బిస్వాస్ ప్రధాన పాత్రల్లో 'ఫ్రీకి అలీ' రూపుదిద్దుకుంది.

Nawazuddin Siddiqui Makes An Interesting Revelation About Superstar Rajinikanth!

ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో జరిగిన సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో సందడిచేసింది. ఈ కార్యక్రమంలో సొహైల్‌ఖాన్, అర్బాజ్‌ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ తదితరులు పాల్గొన్నారు.

చిత్ర దర్శకనిర్మాత సోహైల్‌ఖాన్ మాట్లాడుతూ "కామెడీ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'ఫ్రీకి అలీ'. డిఫరెంట్ స్టోరీ, స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. నవాజుద్దీన్ సిద్దిఖీ, అర్బాజ్ ఖాన్ నటన, అమీ జాక్సన్ గ్లామర్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం"అని అన్నారు.

English summary
Nawazuddin Siddiqui has made an interesting revelation about superstar Rajinikanth that will totally surprise you.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu