»   »  నవాజుద్దీన్ కొడుకు కృష్ణుడట: మతాలని మరోసారి కలిపేసాడు

నవాజుద్దీన్ కొడుకు కృష్ణుడట: మతాలని మరోసారి కలిపేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ స్టార్ నవాజుద్దీన్ సిద్ధిఖీ మరోసారి చర్చల్లోకి వచ్చారు. ఈ సారి వివాదాస్పద వ్యాఖ్యలు, సినీ సంగతుల ప్రస్తావన లేదు. తన కుమారుడి ఘన కార్యంపై ట్వీట్‌చేస్తూ సిద్దిఖీ అలరించాడు. తాజాగా నవాజుద్దీస్ సిద్ధిఖీ తన కుమారుని ఫొటో పోస్ట్ చేశాడు. దానిలో అతని కొడుకు కృష్ణుని గెటప్‌లో దర్శన మివ్వడమే కాకుండా మురళి ఊదుతున్నట్టు ఫోజు పెట్టాడు.

ఈ ఫోటో కింద నవాజుద్దీన్ తన కామెంట్ రాశాడు. తన కుమారుణ్ని కృష్ణుని గెటప్ లో తయారుచేసినందుకు స్కూలు వారికి ధన్యవాదాలు అని పేర్కొన్నాడు. ఈ పోస్టు చూసిన సిద్దిఖీ అభిమానులు అతనిపై అభినందనలు కురిపిస్తున్నారు.

Nawazuddin Siddiqui's Son Plays Krishna In School Drama

వెరైటీ పాత్ర‌ల‌తో అల‌రించే ఈ బాలీవుడ్ న‌టుడు గర్తం లో కూడా ఓ అద్భుత‌మైన వీడియో రూపొందించాడు. మ‌తాల పేరుతో కొట్టుకు చ‌స్తున్న మ‌నుషుల‌కు త‌న‌దైన రీతిలో ఓ సందేశాన్నిచ్చాడు. ఒక్క మాట కూడా లేని ఈ వీడియోలో ప్ల‌కార్డుల సాయంతోనే త‌ను అనుకుంటున్న‌ది స్ప‌ష్టంగా వివ‌రించే ప్ర‌య‌త్నం చేశాడు. తాను డీఎన్ఏ టెస్ట్ చేయించుకున్నాన‌ని, అందులో ఏం తేలిందంటే అన్న ప్ల‌కార్డుతో ఈ వీడియో మొద‌ల‌వుతుంది.

తాను 16.66 శాతం హిందువుని అన్న ప్ల‌కార్డు ప‌ట్టుకొని ప‌క్కా హిందువు రూపంలో అత‌ను క‌నిపిస్తాడు. ఆ త‌ర్వాత 16.66 శాతం ముస్లింన‌ని ముస్లిం రూపంలో.. ఇలా ప్ర‌తి మతం ప్ల‌కార్డుతోపాటు అదే వేష‌ధార‌ణ‌లో క‌నిపిస్తాడు న‌వాజ్‌. చివ‌ర్లో తాను 100 శాతం ఆర్టిస్ట్‌న‌న్న ప్లకార్డుతో వీడియో ముగుస్తుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అయింది. అత‌ని అభిమానుల‌నే కాదు.. నెటిజ‌న్లంద‌రినీ ఆక‌ట్టుకుంటున్న‌ది.

English summary
"I am glad to the school of my kid, who gave him an opportunity to play the character of 'natkhat nandlala'," tweeted Nawazuddin
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu