»   » స్ట్రాంగ్ సెక్యూలర్ మెసేజ్: నవాజుద్దీన్ సిద్ధిఖీ వీడియో వైరల్!

స్ట్రాంగ్ సెక్యూలర్ మెసేజ్: నవాజుద్దీన్ సిద్ధిఖీ వీడియో వైరల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ షేర్ చేసిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ వీడియో చూడటానికి సింపుల్ గా ఉన్నా.... స్ట్రాంగ్ సెక్యూలర్ మెసేజ్ ఇచ్చాడు నవాజుద్దీన్. ఈ వీడియో ఇపుడు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.

హాయ్... నా పేరు నవాజుద్దీన్. నేను డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే.... 16.66% హిందువు, 16.66% ముస్లిం, 16.66% క్రిస్టియన్, 16.66% సిక్క్, 16.66% బుద్దిస్ట్, 16.66% ప్రపంచలోని ఇతర మతాలన్నింటికీ చెందిన వ్యక్తిని అని తేలిసింది. కానీ నేను ఆ ఆత్మతను శోధిస్తే నాకు ఒక విషయం తెలిసిందే. నేను 100% ఆర్టిస్ట్ ను అని... అంటూ ఈ వీడియో సాగింది.

వీడియో హాట్ టాపిక్

సోషల్ మీడియాలో ఇపుడు ఈవీడియో హాట్ టాపిక్ అయింది. కళాకారులను మతాల వారిగా విభజించి చూడొద్దని..... మనం సెక్యూలర్ కంట్రీలో ఉన్నామని చెప్పకనే చెప్పాడు నవాజుద్దీన్.

వివక్ష కొనసాగుతోందా?

వివక్ష కొనసాగుతోందా?

మరి నవాజుద్దీన్ ఇలాంటి వీడియో చేయడం వెనక కారణం ఏమిటి? మత పరంగా ఆయనపై ఏమైనా వివక్ష ఎదుర్కొన్నారా? అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

బాలీవుడ్లో టాప్ పొజిషన్లో ఉన్న నవాజుద్దీన్

బాలీవుడ్లో టాప్ పొజిషన్లో ఉన్న నవాజుద్దీన్

అయితే ప్రస్తుతం నవాజుద్దీన్ అవకాశాల పరంగా బాలీవుడ్లో టాప్ పొజిషన్లో ఉన్నారు. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ప్రస్తుతం చేతి నిండా అవకాశాలతో బిజీగా గడుపుతున్నారు.

సల్మాన్ ఖాన్ మూవీ కూడా చేయలేనంత బిజీ

సల్మాన్ ఖాన్ మూవీ కూడా చేయలేనంత బిజీ

బజరంగీ భాయిజాన్ మూవీలో కీలకమైన పాత్ర పోషించిన నవాజుద్దీన్ తర్వాత సల్మాన్ నెక్ట్స్ మూవీ ‘ట్యూబ్ లైట్' అవాకాశం వచ్చినా రిజెక్ట్ చేసాడు. ఆయన డేట్స్ ఖాళీ లేక పోవడమే ఇందుకు కారణం అని టాక్. ప్రస్తుతం ఆయన మున్నా మైఖేల్, చందమామా దూర్ కె చిత్రాల్లో నటిస్తున్నారు.

English summary
Bollywood actor Nawazuddin Siddiqui has taken to social media to share a video with a strong secular message.Nawaz’s video claims that while he is 16.66 per cent of all religions practiced in India, he is 100 per cent an artiste. Well, we agree!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu