For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘నాయక్’పై పబ్లిక్ టాక్ ( ప్రేక్షకుల అభిప్రాయాలు)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా మాస్ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నాయక్' ఈ రోజు గ్రాండ్‌గా విడులైన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 1200లకు పైగా థియేటర్లలో ఈచిత్రం విడుదలవుతోంది. సినిమాకు కిట్రిక్స్ రొటీన్ వినాయక్ సినిమా అంటూ యావరేజ్ రేటింగ్ ఇచ్చారు. సినిమాలో ఎంటర్ టైన్మెంట్ పాళ్లు మెండుగానే ఉన్నప్పటికీ కొత్తదనం లేక పోవడం వల్ల ఎక్కువగా రేటింగ్ ఇవ్వ లేకపోయారు. క్రిటిక్స్ ఎప్పుడు విమర్శనాత్మక దృష్టితో చూస్తారు కాబట్టి వారి అభిప్రాయాలు అలానే ఉంటాయి.

  కానీ సాధారణ సగటు ప్రేక్షకుడికి, ముఖ్యంగా మెగా అభిమానులకు అదంతా అవసరం లేదు. వాళ్లకి కావాల్సింది వినోదం. మరి 'నాయక్' సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. హైదరాబాద్‌లోని నాయక్ సినిమా చూసిన కొందరి అభిప్రాయాలు సేకరించాం. సినిమా చూసిన వారంతా రకరకాల అభిప్రాయాలు వెల్లడించాయి. కొత్తదనం లేదని కొందరు అన్నప్పటికీ ఓవరాల్ గా నాయక్ సినిమా బాగుందనే ఒప్పుకున్నారు.

  1. శ్రీకాంత్ గౌడ్, బిటెక్ విద్యార్థి

  సినిమా కేక...ఫుల్లీ లోడెడ్ ఎంటర్ టైన్మెంట్ మూవీ. మెగా అభిమానులకు ఫుల్ మీల్స్. సినిమాలో ప్రతి ఫ్రేమూ చాలా బాగుంది. చరణ్ ను చూస్తుంటే మా మెగాస్టారే గుర్తొచ్చాడు. వెండితెరపై మెగాస్లార్ లేని లోటును తీర్చాడు. ఫైట్స్, డాన్సుల విషయంలో చరణ్ కు మరెవరూ సాటిరారు. సెకండాఫ్ హైలెట్ గా ఉంది. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, పోసారి కృష్ణమురళి కామెడీ బాగా నచ్చింది.

  2.ఆకుల సురేష్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, టాటా డొకొమో.

  దర్శకుడు వివి వినాయక్ తన పేరును మరోసరి నిలబెట్టుకున్నాడు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంది. రామ్ చరణ్ యాక్షన్ సూపర్. చరణ్‌ను తొలిసారిగా డబల్ రోల్‌‌లో బాగా అద్భుతంగా చూపించారు. అన్ని వినోదాత్మక అంశాలు సినిమాలో ఉన్నాయి. అందరికీ తప్పకుండా నచ్చే సినిమా.

  3. మహేష్ రావుల, ఇంటర్ విద్యార్థి

  సినిమాలో డైలాగులు అదరి పోయాయి. ప్రతి డైలాగులోనూ చరణ్ తన పవర్ చూపించాడు. ముఖ్యంగా ఫైట్స్, డాన్స్‌ల విషయంలో ఇరగ దీసాడు. కామెడీ సీన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. చరణ్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ కు బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ కామెడీ, హీరోయిన్స్ గ్లామర్ బాగా తోడై సినిమా కేక పుట్టించేలా తయారైంది. రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్ చేర్చినందుకు దర్శకుడు వినాయక్ కి కృతజ్ఞతలు.

  4. రాజ్ కుమార్, ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగి

  సినిమా బాగానే ఉంది, ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. కామెడీ, యాక్షన్, హీరోయిన్స్ గ్లామర్, సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. కానీ సినిమాలో ఏమాత్రం కొత్తదనం లేదు. రొటీన్ కమర్షియల్ మూవీ. వన్ టైం చూడటానికి ఓకే. కామెడీ సీన్లు చూసి నవ్వుకోవడానికైతే మరోసిరి వెళ్లొచ్చు.

  5. రాజశేఖర్, గ్రూఫ్స్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్

  ఇలాంటి సినిమాలు ఇది వరకు చాలా వచ్చాయి. చూపించిన కాన్సెప్టునే తెలుగు సినిమాల్లో ఇంకెన్ని రోజులు చూపిస్తారో. ఇకపైనా హీరోలు, దర్శకులు మారాలి. కొత్త దనం కోసం ప్రయత్నించాలి. నేనే ఏ హీరో అభిమానిని కాదు. సగటు సినిమా ప్రియున్ని. నాయక్ సినిమా బాగానే ఉంది. బోరింగ్ లేకుండా స్క్రీన్ ప్లే, కామెడీతో కవర్ చేసారు. కానీ కథ విషయంలో, ప్రజెంటేషన్ విషయంలో ఇంకాస్త కొత్తగా ప్రయత్నిస్తే బాగుండు.

  బ్యానర్ : యూనివర్శల్ మీడియా, సంస్థ నటీనటలు: రామ్ చరణ్, కాజల్, అమలపాల్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, ఎంఎస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సత్యం రాజేష్, రాహుల్ దేవ్, రఘుబాబు, సుధ తదితరులు, సంగీతం: తమన్, కెమెరా: చోటా కె. నాయుడు, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: ఆనంద్‌ సాయి, కథ, మాటలు: ఆకుల శివ, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ. నిర్మాత: డివివి దానయ్య, దర్శకత్వం: వివి వినాయక్.

  English summary
  
 Ramcharan, VV Vinayak combo Nayak has hit the big-screens worldwide on a grand scale in nearly 1210 screens. The movie gets Positive Talk from Public. Kajal Agarwal and Amala Paul played the female leads and DVV Danayya produced the film on Universal Media banner. Thaman composed the music for the film and Chota K Naidu cranked the cinematography.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X