twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘నాయక్’ సక్సెస్ టూర్ విశేషాలు (ఫోటోలతో...)

    By Srikanya
    |

    విశాఖపట్టణం: సంక్రాంతి కానుకగా ఇటీవల విడుదలైన 'నాయక్' చిత్రం ప్రేక్షకాదరణ పొందిన నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు విజయయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్, దర్శకుడు వి.వి.వినాయక్, నిర్మాత డి.వి.వి.దానయ్య, సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు ఆదివారం వీమాక్స్ థియేటర్‌కు వచ్చారు.

    ఈసందర్భంగా జరిగిన సభలో హీరో రామ్‌చరణ్ మాట్లాడుతూ ఈ చిత్ర కథ అభిమానుల కోసం ప్రత్యేకించి తయారు చేయబడిందన్నారు. ఈ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకాభిమానులకు కృత జ్ఞతలు తెలిపారు.

    ‘నాయక్’ సక్సెస్ టూర్ విశేషాలు (ఫోటోలతో...)

    రామ్‌చరణ్‌ తేజ ఆదివారం నగరంలో సందడి చేశారు.అభిమానులతో ఆ ప్రాంతం రద్దీగా మారింది.

    ‘నాయక్’ సక్సెస్ టూర్ విశేషాలు (ఫోటోలతో...)

    రామ్‌చరణ్‌ మాట్లాడుతూ చిత్రాన్ని ఆదరిస్తున్న అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నాయక్‌ అభిమానుల మన్ననలు పొందేలా వీవీ వినాయక్‌ చాలా బాగా చిత్రీకరించారని అన్నారు. మున్ముందు మంచి సినిమాల్లో నటిస్తానని అభిమానులతో అన్నారు.

    ‘నాయక్’ సక్సెస్ టూర్ విశేషాలు (ఫోటోలతో...)

    చిత్ర దర్శకుడు వి.వి.వినాయక్ మాట్లాడుతూ తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందన్నారు. చిత్రం విజయవంతం చేసినందుకుగాను తమకు ఇష్టమైన విశాఖపట్టణం నుంచి విజయ యాత్ర చేపట్టామన్నారు.

    ‘నాయక్’ సక్సెస్ టూర్ విశేషాలు (ఫోటోలతో...)

    ఈ సందర్భంగా వీమాక్స్‌ థియేటర్‌ ప్రాంగణంలో కొంత సేపు అభిమానులతో ముచ్చటించాడు.

    ‘నాయక్’ సక్సెస్ టూర్ విశేషాలు (ఫోటోలతో...)

    చిత్ర నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ నాయక్ ఎన్నో రికార్డులు బ్రేక్ చేసిందన్నారు. అది ప్రేక్షకుల దయవల్లే అన్నారు.

    ‘నాయక్’ సక్సెస్ టూర్ విశేషాలు (ఫోటోలతో...)

    ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్, వివి వినాయక్‌లను అభిమానులు గజమాలలతో ఘనంగా సత్కరించారు.

    ‘నాయక్’ సక్సెస్ టూర్ విశేషాలు (ఫోటోలతో...)

    రామ్‌చరణ్‌తో కలసి చిత్ర దర్శకుడు వి.వి.వినాయక్‌, చోటా.కె. నాయుడు, డి.వి.వి. దానయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయక్‌ విజయం సాధించిన సందర్భంగా కేక్‌ను కట్‌ చేశారు.

    ‘నాయక్’ సక్సెస్ టూర్ విశేషాలు (ఫోటోలతో...)

    రామ్‌చరణ్‌తో కరచాలనం చేసేందుకు ఒక్కసారిగా అందరూ వేదిక పైకి ఎగబడ్డారు. అభిమానులను కట్టడి చేయడానికి పోలీసులు ఇబ్బంది పడ్డారు.

    ‘నాయక్’ సక్సెస్ టూర్ విశేషాలు (ఫోటోలతో...)

    రహదారి భద్రత సూత్రాలు పాటించడంతోనే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని సినీనటుడు రామ్‌చరణ్‌తేజ్‌ పేర్కొన్నారు.వాహనాలు నడిపే వారు రోడ్డు భద్రతపై పూర్తిస్థాయిలోఅవగాహన పెంచుకుంటే ప్రమాదాల నివారణకు అస్కారం ఉంటుందన్నారు. విశాఖనగరంలో గత మూడేళ్లగా రోడ్డు ప్రమాదాలసంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టడం శుభపరిణామమన్నారు. ఈ సందర్భంగా సీటీ ట్రాఫిక్‌ పోలీసులపై ప్రశంసల జల్లు కురిపించారు.

    అనంతరం వీమాక్స్‌ థియేటర్‌లో ఉదయం ఆట చూస్తున్న అభిమానులను పలకరించాడు. కార్యక్రమంలో వి.వి. వినాయక్‌, విజయ్‌, వాసు, క్రాంతి ఫిలిమ్స్‌ అధినేత ఎన్‌.ఆర్‌.కె. రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయక్‌ చిత్రం విజయోత్సవ కార్యక్రమానికి ఆదివారం ఉదయం నగరానికి వచ్చిన ఆయన మహిళ కళాశాల వద్ద సీటి ట్రాఫిక్‌పోలీసులు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని వాహనదారులకు, అభిమానులకు రోడ్డు భద్రతపై పలు సూచనలుచేశారు.

    English summary
    
 Ram Charan Tej and Actress Amala Paul, Kajal Agarwal starring new Telugu Film Nayak was successfully released and well received by audience. The Movie Success Meet Event was held in Vizag. Stars like Ram Charan Tej, Director V.V. Vinayak and others are part of the Success Meet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X