షాకిస్తున్న ‘నాయక్’ ఓపెనింగ్ డే థియేటర్ల కౌంట్
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ నెల 9న 'నాయక్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి హాలిడేస్ సీజన్ కావడంతో నిర్మాతలు ఈచిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేసి రికార్డు స్థాయి ఓపెనింగ్స్ సాధించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు భారీ స్థాయిలో థియేటర్లను నాయక్ కోసం బుక్ చేసారు. తాజాగా అందిన వివరాల ప్రకారం తొలి రోజు ఏయే ఏరియాల్లో 'నాయక్' చిత్రం ఎన్ని థియేటర్లలో విడుదలవుతుందో ఓ లుక్కేద్దాం.
థియేటర్ల సంఖ్య ఏరియాల వారిగా...
నైజాం : 320+
సీడెడ్ : 140+
నెల్లూరు : 45+
గుంటూరు : 90+
కృష్ణా : 85+
వెస్ట్ గోదావరి : 85+
ఈస్ట్ గోదావరి : 95+
ఉత్తరాంధ్ర : 105+
కర్నాటక : 125+
తమిళనాడు : 45(చెన్నై-24, కోయంబత్తూర్-02, మధురై-01, తంజావూరు-01,తిరువల్లూరు-06, ఇతర ప్రాంతలు-10+)
రెస్టాఫ్ ఇండియా : 40
ఇండియా వ్యాప్తంగా టోటల్ థియేటర్ల సంఖ్య దాదాపు గా 1200
ఇదే కాకుండా ఈ సారి యూఎస్‌లో రికార్డు స్థాయి స్క్రీన్లలో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఏ తెలుగు సినిమా కూడా విడుదల కానన్ని స్క్రీన్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సంక్రాంతికి రామ్ చరణ్-వివి వినాయక్ కాంబినేషన్లో వస్తున్న 'నాయక్' చిత్రం పలు రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు.
నాయక్ చిత్రాన్ని యూనివర్సల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మాత. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలపాల్ రొమాన్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, ఆశిష్ విద్యార్థి, ప్రదీప్ రావత్, సుధ తదితరులు నటిస్తున్నారు. కథ, మాటలు: ఆకుల శివ, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, కళ: ఆనంద్ సాయి, సంగీతం: తమన్, దర్శకత్వం: వివి వినాయక్.


Click it and Unblock the Notifications











