»   » త్రిష భయ పెడుతోంది (నాయకి ట్రైలర్)

త్రిష భయ పెడుతోంది (నాయకి ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ త్రిష చాన్నాళ్ళ తరువాత తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్‌ మూవీలో నటిస్తోంది. మూడు పదులు దాటిన చెన్నై పొన్ను త్రిష... 'నాయకి' గెటప్‌లో అదిరిపోయింది. గోవీ దర్శకుడు. రాజ్ కందుకూరి స‌మ‌ర్పిస్తున్న సినిమా గిరిధ‌ర్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ నిర్మిస్తోంది. త్రిష ఈ సినిమాలో నాయిక‌గా న‌టిస్తోంది. గిరిధ‌ర్ మామిడిప‌ల్లి, ప‌ద్మ‌జ మామిడిప‌ల్లి నిర్మాత‌లు. రఘుకుంచె సంగీతం అందిస్తున్నారు. మంగళవారం జరిగిన ఆడియో రిలీజ్ సందర్భంగా ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు.

Nayaki Movie Theatrical Trailer

ట్రైలర్ ఆకట్టుకునే విధంగా కట్ చేసారు. ఈ సినిమాలో త్రిష అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను మైమరిపిస్తూనే... మరో వైపు ప్రేక్షకులను భయపెట్టబోతోంది. ఈ సినిమా కోసం త్రిష పాట కూడా పాడటం విశేషం. త్రిష కెరీర్లో ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చే సినిమా అవుతుందని అంటున్నారు.

ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా హీరో పాత్రలో సత్యం రాజేష్ నటిస్తున్నారు. బ్ర‌హ్మానందం, గ‌ణేష్ వెంక‌ట్ రామ‌న్‌, సుష్మ‌రాజ్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, మ‌నోబాల‌, కోవై స‌ర‌ళ‌, పూన‌మ్ కౌర్‌, మాధ‌వీల‌త‌, సెంట్రియాన్‌,జీవీ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ధారులు.

ఈ సినిమాకు ఫైట్ మాస్ట‌ర్‌: వెంక‌ట్‌, క‌ళ‌: కె.వి.ర‌మ‌ణ‌, కూర్పు: గౌతంరాజు, పాట‌లు: భాస్క‌రభ‌ట్ల‌, సంగీతం: ర‌ఘు కుంచె, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌: సాయికార్తిక్‌, లైన్ ప్రొడ్యూస‌ర్‌: ఎం.వెంక‌ట‌సాయి సంతోష్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: రాంబాబు కుంప‌ట్ల‌, కెమెరా: జ‌గ‌దీష్ చీక‌టి, నిర్మాత‌: గిరిధ‌ర్ మామిడిప‌ల్లి, ప‌ద్మ‌జ మామిడిప‌ల్లి, క‌థ‌, క‌థ‌నం, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: గోవి.

English summary
Nayaki 2016 Telugu Movie Theatrical Trailer , Starring Trisha, Ganesh Venkatram and Brahmanandam. Music composed by Raghu Kunche, directed by Govi Goverdhan and produced by Giridhar Mamidipally under Giridhar Productions banner.
Please Wait while comments are loading...