»   » త్రిష ఇప్పటికే ఆలస్యం చేసింది ఇదైనా పక్కా నేనా???

త్రిష ఇప్పటికే ఆలస్యం చేసింది ఇదైనా పక్కా నేనా???

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్రిష ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న "నాయకి" చిత్రం విడుదలకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా జులై 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. దర్శకుడు గొవి తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. త్వరలో ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నట్లు ట్వీట్‌ చేశారు.

దర్శకుడు గోవీ తెరకెక్కించిన ఈ హర్రర్ కామెడీ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది.. ఆడియోతోపాటు ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది.. అంతే ఆ తర్వాత మళ్ళీ వార్తల్లో లేకుండా పోయింది. గత రెండు నెలలుగా రిలీజ్ విషయంలో యూనిట్ క్లారిటీ ఇవ్వలేక సైలెంట్‌గా ఉండిపోయింది. ఇప్పుడు ఇన్నాళ్ళకు తిరిగి ఈ సినిమా వార్తల్లోకి వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను రీసెంట్‌గా పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.

"Nayaki" will hit silver screens on 8th July

సెన్సార్ బృందం ఈ సినిమాకి 'ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే.. ఇది కేవలం పెద్దలకు మాత్రమేనన్నమాట. ఇందులో హర్రర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్లే సెన్సార్ "ఏ" సర్టిఫికెట్ ఇచ్చినట్లు చెబుతున్నా. ఇదులో త్రిష అందాల ఆరబోత కూడా ఎక్కువే ఉందని టాక్.

తొలిసారి మహిళా పాత్ర ప్రధానంగా గల హారర్‌ చిత్రంలో త్రిష నటించింది. ఇప్పటి వరకు త్రిష బికిని లాంటి కాస్ట్యూమ్స్ ధరించి, అందాలను ఆరబోసిన సినిమాలు చాలా తక్కువనే చెప్పాలి. కానీ తన పెళ్ళి కి బ్రేక్ పడటంతో, సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన త్రిష ఈ సారి హాట్ హాట్ గా కనిపించనుంది. తాజాగా ఈ బ్యూటీ, తన అప్ కమింగ్ మూవీ "నాయకి" లో బికినీ ధరించి అందాలను ఆరబోసిందట. తెలుగు, తమిళ భాషల్లో త్వరలో విడుదల కాబోతున్న ఈ హారర్ మూవీలో తమ అభిమానులు ఇంతకుముందెన్నడూ చూడని గ్లామర్ అవతారాల్లో త్రిష కనిపించబోతుందని సమాచారం.

ఈ చిత్రానికి గిరిధర్‌ మామిడిపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం సమకూర్చారు. సుష్మారాజ్‌, గణేష్‌ వెంకట్రామన్‌, బ్రహ్మానందం, కోవై సరళ, సత్యం రాజేశ్‌, మనోబాల తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.

English summary
Trisha's Nayaki was supposed to hit the screens in June, the release has been delayed due to reasons unknown. According to the latest updates, the makers are planning to release the film on July 8 on the occasion of the holy Eid.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu