»   » ఔను నాకు పోగరే ఇప్పుడేంటీ..??? నయనతార

ఔను నాకు పోగరే ఇప్పుడేంటీ..??? నయనతార

Posted By:
Subscribe to Filmibeat Telugu

తనకు ఇచ్చిన పాత్రను పర్ఫెక్ట్ గ ప్రెజెంట్ చేసే నటి నయనతార తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక టైం లో టాప్ మోస్ట్ యాక్టర్స్ అందరితో నటించింది. ఎంత టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుందో దాదాపు అంతే స్థాయిలో వివాదాలనూ, విమర్శలనూ మూటగట్టుకుంది. అందరి కీ తెలిసిన విషయం ఏమిటంతే నయన్ ఎప్పుదూ నంగి, నంగిగా మొహమాటం గా ఉండదు ఏది ఉన్నా మొహమ్మీదే చెప్పేస్తుంది,

ముందున్నది ఏవరూ ఏమిటీ అన్నది చూడకుండా ఎదిరించి పొగరు బోతు అనే ముద్ర వేసుకుంది. ఈ విషయమే ఈ మధ్య అడిగినప్పుడు ఆవిషయం కూడా అంతే "పొగరు" గా సమాధానం చెప్పింది. నయన్ స్వభావమే అంత అందరూ గర్వం అనుకునే... తన ఆత్మవిశ్వాసమే ఆమె బలం

Nayan clarifies on being insolent

ఇంతకీ విలేఖరి అడిగిన ప్రశ్నకి ఆమె ఏం చెప్పిందీ అంటే... ఔను.. నేను పొగరుబోతునే అందులో అనుమానమే లేదు. అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. కానీ ఆ పొగరుకీ కొన్ని మినహాయింపులున్నాయట, తనను తక్కువగా చూసేవాళ్ల విషయంలో మాత్రమే తాను పొగరు చూపిస్తానని, అదే పొగరు తనదగ్గర చూపించాలని చూస్తే మాత్రం అంతకంతా తాను తగ్గననీ చెప్పిన నయన్,

సినీ పరిశ్రమలో హీరోయిన్ గా రాణించడం అంత సులువు కాదు, దీనికోసం నేను పడ్ద కష్టం చెప్పలేనంత పెద్దది. మొట్లో నేను చేసిన పొరపాట్లు నన్ను దాదాపు ఫెయిల్యూర్ అంచులవరకూ తీసుకువెళ్ళాయి మొదట్లో సినీ పరిశ్రమ గురించి పూర్తిగా తెలియకపోవడం వల్ల కథల ఎంపికలో, అందాల ప్రదర్శన విషయంలో పొరపాట్లు చేసాను కానీ ఇప్పుడు అలా ఉండటం లేదు. నా పనికి నాకు కావాల్సిందేమిటో ఖచ్చితంగా అడిగితీసుకుంటున్నాను.. అది వాళ్ళకు పొగరుగా కనిపిస్తే అది నా తప్పుకాదు. వాళ్ళనుకున్నట్టు అది పొగరే అయితే అవును నేను పొగరు బోతునే అని చెప్పేసింది.

English summary
Beautiful actress Nayantara clarified that she is insolent., but her insolence is towards those people who undermine her and treat her like a slave rather than a human being.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu