హైదరాబాద్: సింహా, శ్రీరామ రాజ్యం చిత్రాల్లో బాలయ్యకు తగిన జోడీగా నటించి ప్రశంసలు అందుకున్న నయనతార ఆయనతో మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ‘లౌక్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో త్వరలో బాలయ్య 99వ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా నయనతారను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. కోన్ వెంకట్, గోపీ మోహన్ రచయితలుగా పని చేస్తున్నారు. తమన్ సంగీతం అందించనున్నారు. ప్రస్తుతం ‘లయన్' షూటింగులో బిజీగా ఉన్నారు.
సత్య దేవా దర్శకత్వం వహిస్తున్న ‘లయన్' చిత్రంలో త్రిష మరియు రాధిక ఆప్టే హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇందులో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. బాలయ్య తాజా హిట్ లెజండ్ విడుదల తేదీన అంటే మార్చి 28న ఈ కొత్త చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించికున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా, సామాన్యుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత. యాక్షన్ ఎంటర్టైనర్ గా అభిమానులను అలరించే అన్ని అంశాలతో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.
నీతి, నిజాయతీలను ప్రాణంగా భావించే ఆయన కథ ఇది. ఆయన సమాజానికి మంచి చేయాలనే సంకల్పంతో ఓ కేసు విషయంలో అవినీతి పరుల కు వ్యతిరేకంగా పోరాడి...నాయకుడిలా మారి అక్రమార్కుల గుండెల్లో గుబులు రేకెత్తిస్తారు. కథలో మలుపులు ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తాయి.
అటు రాజకీయంగా, ఇటు సినిమాపరంగా వరుస విజయాలు సాధిస్తూ ఊపుమీదున్న బాలకృష్ణ ఎంతో ఉత్సాహంతో ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. బాలకృష్ణ గతంలో నటించిన ‘సీతారామకల్యాణం', ‘బొబ్బిలిసింహం', ‘తల్లిదండ్రులు' చిత్రాల తరహాలో మంచి హిట్ కొట్టబోతున్నామని నిర్మాత చెప్తున్నారు. బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్ ప్రసాద్, కూర్పు: గౌతంరాజు.
Balakrishna is currently acting in Satyadeva’s direction, it is his 98th film after this film he has not signed any film, it is being heard that Srivas may direct his 99th film, Srivas is riding high with the super success of Loukyam film, earlier this year he directed Pandavulu Pandavulu Thumeda which bombed at the box office, but he bounced back with Loukyam, the shooting of this film may begin from the February 2015 and release in Dushera season of the same year.
Story first published: Friday, January 23, 2015, 14:35 [IST]