»   »  ఆ హీరోకు ముద్దు ఇవ్వనన్న నయనతార

ఆ హీరోకు ముద్దు ఇవ్వనన్న నయనతార

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nayantara
హీరోయిన్ల కష్టాలు హీరోయిన్లవి. హీరోల్లాగా ఇష్టమైన పనులు చేయడానికి ఉండదు. ఇష్టంలేని పనులు చేయనంటే కుదరదు. అయినా నయనతార ఇష్టంలేని పని చేయనంది. ససేమిరా అంది. ఆ హీరోకు ముద్దు ఇవ్వనంటే ఇవ్వనంది. ఆ హీరో పేరు విశాల్. వీరిద్దరి సినిమా సత్యం. రెండు రోజుల క్రితం ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన విశాల్ తమ సినిమాలో ఒక సీన్ లో నయనతార తో ప్రెంచ్ కిస్ ఉంటుందని చెప్పాడు. ఇది చూసిన నయనతార తీవ్రంగా స్పందించింది. ఇలాంటి పుకార్లకు కారణమయ్యే సీన్ లకు ఒప్పుకునే సమస్యేలేదంది. అసలు నాకు తెలిసి ఇలాంటి సీనే సత్యం స్క్రిప్ట్ లో లేదు. ఇప్పటికే ముద్దు సీన్ లో తాను పాల్గొన్నట్టు మీడియా రాసింది. అలాంటిదేమీలేదని నయనతార స్పష్టం చేసింది. పోలీసు కథతో రూపొందుతున్న చక్కని సినిమా ఇది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X