»   » 'అనామిక' ఆడియో: నయనతార ట్విస్ట్ ఇచ్చింది (ఫొటోలు)

'అనామిక' ఆడియో: నయనతార ట్విస్ట్ ఇచ్చింది (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'అనామిక'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆడియో ని హైదరాబాద్ లో లాంచ్ చేసారు. బిగ్ సీడిని రమేష్ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు వయాకామ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఆడియో పంక్షన్ లో నయనతార పాల్గొనలేదు. నయనతార కు ఈ చిత్ర నిర్మాతలకు టెర్మ్స్ సరిగ్గా లేకపోవటంతో నయనతార రాలేదని వినపడుతోంది.

హిందీలో విజయవంతమైన 'కహానీ' సినిమా ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. అక్కడ విద్యాబాలన్‌ పోషించిన పాత్రలో ఇక్కడ నయనతార నటిస్తోంది. వైభవ్‌, హర్షవర్ధన్‌ రాణే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎండమోల్‌ ఇండియా, లాంగ్‌లైన్‌ ప్రొడక్షన్స్‌, సెలెక్ట్‌ మీడియా హోల్డింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రం సెన్సార్ ఇప్పటికే పూర్తైంది. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాను మే 1 విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ,తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందింది.

స్లైడ్ షోలో... ఆడియో లాంచ్ ఫోటోలు..విశేషాలు

రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ...

రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ...

మా నాన్నగారు సినిమా పరిశ్రమకు చాలా చేసారు. స్టెప్ బై స్టెప్ గా ఆయన ఎదిగారు. నేను కూడా ఆయన బాటలోనే ఈ పరిశ్రమలో నడుస్తున్నాను. శేఖర్ కమ్ముల గారితో సుదీర్ఘ పరిచయం ఉంది. ఆయన తెరకెక్కించిన ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి అని అన్నారు.

కీరవాణి మాట్లాడుతూ...

కీరవాణి మాట్లాడుతూ...

ఏ పాట రాసినా సిరివెన్నెల గారు ఆ పాటకు ఓ ప్రత్యేకతను తీసుకువస్తారు. నిజంగా అలాంటి గొప్ప రచయిత మనకుండటం గర్వకారణం. ఆయన పాట కోసం ఎంత కాలమైనా వెయిట్ చేస్తాం. శేఖర్ కమ్ముల తో పనిచేయటం బాగుంది. సినిమా పాటల్ని, సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు.

సిరివెన్నెల మాట్లాడుతూ...

సిరివెన్నెల మాట్లాడుతూ...

చాలా మంది నా దగ్గరకు వచ్చి బాగా రాశానని పొగుడుతూంటారు. నాకు పొగడ్తలు ఇష్టముండదు. కానీ కొన్ని సందర్భాల్లో గుర్తించి పొగిడినప్పుడు ఆనందిస్తాం. దర్శకుడులో నిద్రాణమై ఉన్న విషయాన్ని మేం అక్షరాల్లో పెడతాం. కీరవాణి బాణిలకు పాట రాయటం చాలా ఇష్టం. గొప్ప సంగీత దర్శకుడు. అచ్చమైన తెలుగు ట్యూన్ ఇస్తారు అన్నారు.

శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...

శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...

కహానీ సినిమా నాకు నచ్చి ఆ సినిమాని రూపొందించటానికి నా అంతట నేను ముందుకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ నిర్మాతలు ఆ కథను కొని నా దగ్గరకు వచ్చి సినిమా చేయమన్నారు. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కి నేషనల్ అవార్డు తెచ్చుకున్న సినిమా అది. ఈ సినిమాని తెలుగులో తీయటం కష్టం. కేర్ తీసుకుని చేసాం. తెలుగువారికి కొత్త జోనర్ అవుతుంది అన్నారు.

ఇందులో ప్రెగ్నింట్ గా ఉండదు

ఇందులో ప్రెగ్నింట్ గా ఉండదు

శేఖర్ కమ్ముల కంటిన్యూ చేస్తూ... ఈ సినిమా చేయాలా వద్దా అని ముందు కాస్త సంకోచించాను. కానీ నిర్భేయ ఘటన జరిగిన తర్వాత ఫిల్మ్ మేకర్ గా నా వంతు ఏదైనా చేయాలని ఈ సినిమాను చేసాను. యండమూరి వీరేంధ్రనాథ్ గారితో పనిచేయటం గొప్ప ఎక్సపీరియన్స్. ఒరిజనల్ కహానీలో అమ్మాయి ప్రెగ్నెంట్ గా ఉంటుంది. కానీ ఇందులో ప్రెగ్నింట్ గా ఉండదు. ప్రెగ్నెంట్ అంటే కొంత సింపతీ ఉంటుంది. అది నేను వాడుకోదలుచుకోలేదు. తమిళ్ లో కూడా చేయటం ఆనందంగా ఉంది. ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ లో నడిచే కథ. ఓల్డ్ సిటీ సెట్ వేసాం.

రెండు పాటలే...

రెండు పాటలే...


శేఖర్ కమ్ముల కంటిన్యూ చేస్తూ... ఈ సినిమా చేద్దామనుకున్నప్పుడే కీరవాణిగారిని అనుకున్నాం. సిరివెన్నెల గారితో పనిచేయాలని ఎప్పటినుంచో అనుకన్నాం. ఇప్పటికి కుదురింది. ముందు ఒక పాట అనుకున్నా రెండో పాటను కూడా పెట్టాం. అది కూడా సందర్భానుసారంగా ఉంటుంది. ఈ సినిమాకు కూడా విజయ్ సి కుమార్ మంచి కెమెరా పనితనం చూపించారు. అరవై,డబ్బై రోజుల్లో చేసాం అని శేఖర్ కమ్ముల వివరించారు.

నయనతారపై కోపం

నయనతారపై కోపం

శేఖర్ కమ్ముల కంటిన్యూ చేస్తూ... నయనతార ఆడియోకి రాకపోవటం చాలా కోపంగా ఉంది. కానీ సినిమాకు ఆమె వంద శాతం న్యాయం చేసింది అన్నారు. నా ప్రతీ సినిమాలాగే రిలీజ్ విషయంలో చాలా డిలే అవుతూ వచ్చింది. ఈ సినిమా రెండు గంటల ఐదు నిముషాలే ఉంటుంది. దాని కారణం యండమూరిగారే అని శేఖర్ కమ్ముల చెప్పారు.

యండమూరి వీరేంధ్రనాథ్ మాట్లాడుతూ...

యండమూరి వీరేంధ్రనాథ్ మాట్లాడుతూ...

శేఖర్ ఫోన్ చేసి ఈ సినిమా గురించి చెప్పారు. నేను ఇంతవరకూ ఇరవై ఐదు సినిమాలకు పనిచేసాను. కానీ ఈ సినిమాకు పడినంత తపన ఏ సినిమాకూ పడలేదు. తనతో వర్క్ చేయటం ప్లెజంట్ గా ఉంటుంది. కహాని స్క్రిప్టు కన్నా ఈ సినిమా స్క్రిప్టు ఇంకా బావుంటుంది. ఈ సినిమాలో సామాజిక అంశాలను కూడా జోడించాం. సీతారామశాస్త్రి రాసిన సినిమాకు నేను పనిచేయటం ఆనందంగా ఉంది అన్నారు.

కోదండరామిరెడ్డి మాట్లాడుతూ...

కోదండరామిరెడ్డి మాట్లాడుతూ...

మా అబ్బాయికి ఆల్ మోస్ట్ హీరో పాత్ర ఇచ్చారు శేఖర్. ఈ సినిమాకు చాలా పెద్ద టెక్నీషియన్స్ పనిచేసారు. వాళ్లందరితోనూ నేను గతంలో పనిచేసాను. ఈ టీమ్ కు ఆల్ ది బెస్ట్ అన్నారు.

నరేష్ మాట్లాడుతూ...

నరేష్ మాట్లాడుతూ...

ఈ సినిమాలో నేను నటించలేదు..బిహేవ్ చేసాను. మే 1 న విడుదలయ్యే ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని చెప్పారు.

వైభవ్ మాట్లాడుతూ..

వైభవ్ మాట్లాడుతూ..


ఎప్పటినుంచో శేఖర్ కమ్ముల గారిని నాకు పాత్ర ఇవ్వమని అడుగుతున్నా. ఈ సినిమాకు కుదురింది. తనతో వర్క్ చేయటం ఆనందంగా ఉంది అని తెలిపారు.

అన్వేషణ

అన్వేషణ

''పెళ్త్లెన ఓ మహిళ నేపథ్యంలో సాగే కథ ఇది. ఆమె ఎవరి కోసం అన్వేషణ ప్రారంభించింది? జీవితంలో ఎలాంటి ఆటుపోట్లను ఎదుర్కొంది? అనే విషయాలు ఆసక్తికరం. ఎం.ఎం.కీరవాణి స్వరాలు చిత్రానికి బలాన్నిస్తాయి. ఈ చిత్రంలో వైభవ్‌ పోలీసు కానిస్టేబుల్‌ పాత్రను పోషిస్తున్నారు. ఈ కథలో కీలకమైన పాత్ర ఇది''అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విజయ్‌ సి.కుమార్‌.

English summary
The audio album of Sekhar Kammula's Anaamika took place at Hotel Marriott, Hyderabad . M M Keeravani has scored music for this film. Nayanatara has skipped the audio launch.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu