»   » నన్ను నిలబెట్టిన అంశం అదే: నయనతార

నన్ను నిలబెట్టిన అంశం అదే: నయనతార

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ''నా ఆలోచనలన్నీ భిన్నంగా ఉంటాయని చెప్పలేను కానీ... నలుగురిలా నేను ఉండకూడదని మాత్రం అనుకొంటుంటాను. భాష ఏదైనా అన్ని సినిమాల్నీ చూస్తాను. అందులో నాయికలు ఎలా నటించారో పరిశీలిస్తాను. అయితే వాళ్లకి భిన్నంగా నేను తెరపై కనిపించాలని మాత్రం తపిస్తాను. నన్ను ప్రత్యేకంగా నిలబెట్టిన అంశం కూడా అదే'' అని చెబు తోంది నయనతార.

అలాగే నా సినీ జీవితంలో ప్రత్యేకమైన దశ ఇది. ఒక నటిగా నాలో నాకు చాలా మార్పులే కనిపిస్తున్నాయి. నచ్చిన పాత్రల్ని ఎంచుకొంటూనే నాణ్యమైన పనితీరును కనబరుస్తున్నాను. నటన తప్ప మరో ఆలోచన నా మనసులోకి రావడం లేదు. అది చక్కటి ఫలితాన్నిస్తోంది. 'అనామిక'లో నటించడం ఒక మధురమైన అనుభూతి అంటోంది నయనతార.

ఇక తోటివారు ఏం చేస్తున్నారో చూసి నేర్చుకోవడం ఒక ఎత్తు. అదే సమయంలో వాళ్లు చేసే ఎలాంటి పనులు మనం చేయకూడదో తెలుసుకోవడం మరో ఎత్తు. ఇందులో నేను రెండోదాన్ని నమ్ముతాను అంటోంది నయనతార. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో 'అనామిక' సినిమాలో నటిస్తోంది. తమిళంలో 'రాజా రాణి', 'ఆరంభం' చిత్రాలతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

శేఖర్ కమ్ముల తో నయనతార ప్రస్తుతం అనామిక చిత్రం చేస్తోంది. ఆ చిత్రం కహానీ రీమేక్ అని తెలిసిందే. నయనతార మాట్లాడుతూ.. 'దర్శకుడు శేఖర్ కమ్ముల కేవలం కహానీ మూలకథను మాత్రమే తీసుకుని విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూర్తిగా కహానీ చిత్రాన్ని యధాతధం గా తీసుకుని చేయడం లేదు. తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది'అని తెలిపింది.

English summary
Speaking about Anamika the leading lady Nayanatara said that director Shekar Kammula has not copied the film frame by frame. He has just adapted the core story and has given it a different treatment, she said. This has been done so that the film caters to the Telugu and Tamil audiences.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu