»   » 'కహాని' రీమేక్‌ అందుకే ఒప్పుకున్నా :నయనతార

'కహాని' రీమేక్‌ అందుకే ఒప్పుకున్నా :నయనతార

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ :నయనతార ప్రస్తుతం 'కహాని' రీమేక్‌లో నటిస్తోంది. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. 'అనామిక' అనే పేరుని నిర్ణయించారు. ఈ సందర్భంగా నయన మాట్లాడుతూ తాను 'కహాని' రీమేక్ ఒప్పుకోవటానికి కారణం వివరించింది.

నయనతార మాట్లాడుతూ...కహాని' సినిమాలో చాలా మార్పులు చేశారు. నా పాత్ర తీరుతెన్నులు కూడా మారాయి. నా శైలిలోనే నటించాను. ఎంత రీమేక్‌ అయినా మార్పులు, చేర్పులూ అవసరం. మక్కీకి మక్కీ తీస్తే చూడ్డానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఒక వేళ అలాంటి కథలే నాముందుకు వస్తే అంగీకరించను. శేఖర్‌ శైలి తెలుసు కాబట్టి, ఆయన మార్పులు నచ్చాయి కాబట్టి 'కహాని' ఒప్పుకున్నా అని చెప్పుకొచ్చింది.

అలాగే... 'ప్రతి ఒక్కరికీ సొంత శైలి ఉంటుంది. రీమేక్‌ కథల్లో నటించినంత మాత్రాన మరొకరి శైలిని అనుకరించాలని లేదు కదా?. విద్యాబాలన్‌ సహజ నటి. చాలా బాగా నటించారామె. నేను కూడా ఆమె పంథాలోనే వెళ్తే కాపీ కొట్టినట్టే. శేఖర్‌ కమ్ముల నాకు ఆ అవకాశం ఇవ్వలేదు.'' అంటోంది నయనతార.

ఎండర్ మోల్ ఇండియా, లాగ్ లైన్ ప్రొడక్షన్స్, సెలక్ట్ మీడియా హోల్డింగ్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కహానీ చిత్రం కోల్ కతా బ్యాక్ డ్రాప్‌తో సాగుతుంది. అయితే ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగిన విధంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యాన్ని ఎంచుకున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల

నయనతార ఈ చిత్రానికి ప్రముక నావెలిస్ట్ యండమూరి వీరేంద్రనాధ్ ఈ చిత్రానికి సహాయ రచయితగా పని చేస్తున్నారు. విజయ్ సి. కుమార్ సినిమాగ్రఫీ చేయనున్నారు. సినిమా కథ విషయానికొస్తే... కనిపించకుండాపోయిన తన భర్త గురించి ఒక ఎన్ ఆర్ ఐ గర్భిణి చేసే అన్వేషణే ఈ కహానీ చిత్ర కథ.

అనేక హాలీవుడ్ సినిమాల స్ఫూర్తి‌తో చేసిన ఈ సినిమా హిందీలో ఘన విజయం సాధించడంతో తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రం గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...కహానీ తెలుగు, తమిళం రీమేక్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని, ఇక్కడి నేటివిటీకి తగిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు వెల్లడించారు. కాగా....బాలీవుడ్ వెర్షన్ 'కహానీ'కి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించగా, విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించింది.

English summary

 Nayanatara is busy with Sekhar Kammula's Aanamika movie. Nayantara is playing the lead in this Telugu-Tamil bi-lingual in which her character name is chosen as 'Anamika'. It is remake of Bollywood hit film 'Kahaani'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu