»   » అతనే..., ప్రెగ్నెన్సీ విషయమై నయనతార!

అతనే..., ప్రెగ్నెన్సీ విషయమై నయనతార!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ హాట్ బ్యూటీ నయనతార త్వరలో 'అనామిక' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నసంగతి తెలిసిందే. హిందీలో విద్యా బాలన్ నటించిన 'కహానీ' అనే హిట్ చిత్రానికి ఇది రీమేక్. తెలుగులో 'అనామిక' చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు.

సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటోందని విమర్శలు ఎదుర్కొన్న నయనతార...ఎట్టకేలకు వీడియో ఇంటర్వ్యూ ద్వారా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయడం అంత సులభమేమీ కాదని చెప్పిన ఆమె, సినిమాలో ప్రధాన పాత్ర పోషించే వారిపై అధిక భారం, రెస్పాన్సిబిలిటీ ఉంటుందని అంటున్నారు. అదే విధంగా కహానీ చిత్రంలో విద్యాబాలన్ గర్భం దాల్చినా....ఈ చిత్రంలో నయనతార గర్భం దాల్చక పోవడంపై వివరణ ఇచ్చింది.

Nayantara about Pregnancy

నేను గతంలో తులసి, శ్రీరామ రాజ్యం లాంటి చిత్రాల్లో గర్భవతిగా, తల్లి పాత్రల్లో నటించాను. ఇలాంటి పాత్రలు చేయడానికి నేనేమీ వ్యతిరేకం కాదు. కహానీ చిత్రంలో విద్యా బాలన్ మాదిరి గర్భవతి పాత్రను నేను చేయడానికి రెడీ అన్నాను, కానీ దర్శకుడు శేఖర్ కమ్ముల వద్దని చెప్పారు' అని నయనతార తెలిపారు.

ఈ చిత్రంలో ఇంకా వైభవ్‌, హర్షవర్ధన్‌ రాణే కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎండమోల్‌ ఇండియా, లాంగ్‌లైన్‌ ప్రొడక్షన్స్‌, సెలెక్ట్‌ మీడియా హోల్డింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం సెన్సార్ ఇప్పటికే పూర్తైంది. 'U/A'సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రం మే 1న విడుదలవుతోంది.

English summary
'In Tulasi and Sri Ramarajyam I acted as a mother of kids, so I'm never aghast playing pregnant on silver screen. In fact I wanted to play pregnant like Vidya Balan has done in the original. But it is Sekhar's call end of the day, and he exclaimed a big no', Nayantara said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu