»   » ఎ.ఆర్‌.మురుగదాస్‌ చిత్రం తెలుగులో ఈ నెల్లోనే...

ఎ.ఆర్‌.మురుగదాస్‌ చిత్రం తెలుగులో ఈ నెల్లోనే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ట్వంటియత్‌ సెంచురీ ఫాక్స్‌స్టార్‌ స్టూడియోస్‌ నిర్మాణంలో దర్శకుడు ఎ.ఆర్‌.మురుగ దాస్‌ సమర్పణలో వస్తున్న మరో చిత్రం 'రాజా రాణి'. ఈ చిత్రం తమిళంలో ఇప్పటికే విడుదలై విజయం సాధించింది. దీనిని త్వరలో ఇదే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ఎ.ఆర్‌.మురుగదాస్‌ మీడియాతో మాట్లాడారు.

ఎ.ఆర్‌.మురుగదాస్‌ మాట్లాడుతూ ''ప్రియురాలిని కోల్పోయిన హీరో, ప్రియుడిని కోల్పోయిన హీరోయిన్‌ వీరిద్దరికీ అనుకోని పరిస్థితుల్లో పెళ్ళి జరుగుతుంది. వారి ప్రేమలని మరచిపోలేని వారిద్దరి మధ్య దాంపత్య జీవితం ఎలా సాగింది అనే అంశాన్ని కలర్‌ఫుల్‌ యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాడు దర్శకుడు అట్లీకుమార్‌. అన్యోన్యతను కోల్పోయిన భార్యభర్తల మధ్యసాగే సెంటిమెంట్‌ బాగా వర్కవుట్‌ అయింది. నయనతార, నజ్రియా, ఆర్య, జై, సత్యరాజ్‌, సంతానం మంచి కలర్‌ఫుల్‌ కాంబినేషన్‌లో రూపొందించారు.'' అన్నారు.

Raja Rani

మరో వారంలో ఆడియో విడుదల చేసి... ఈనెలలోనే సినిమాని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఆరు పాటలున్న ఈ సినిమాకి జి.వి.ప్రకాష్‌కుమార్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని మురుగదాస్ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అత్లీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పెళ్లి తర్వాత జంటల మధ్య జరిగే తీయటి సంఘటనలను ప్రధానంగా ఫోకస్ చేయనున్నారట.

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...'రాజా రాణి చిత్రం ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టెనర్, పెళ్లి తర్వాతి తీయని జీవితాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నాం' అని వెల్లడించారు. ఫ్యామిలీ ప్రేక్షకులతో పాటు యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉందని తెలిపారు. ఆర్య, నయనతార పెళ్లయిన జంటగా పర్‌ఫెక్టుగా నటించారు, వారి మధ్య సినిమాలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్రంలో ఆర్య, నయనతార, జై, సంతానం, సత్యరాజ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

English summary
Raja Rani is a 2013 Tamil romantic comedy film directed by debutant Atlee, (who previously worked with Shankar as an assistant on Enthiran (2010)) and produced by AR Murugadoss in association with Fox Star Studios.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu